AP News: ఏపీ రాజకీయాల్లో కాకరేపుతోన్న ప్రధాని మోదీ కామెంట్స్.. ఎవరు మిత్రులు.? ఎవరు శత్రువులు.?

ఏపీ రాజకీయాల్లో ఎవరికెవరు ఏమవుతారు? మిత్రులెవరు? ప్రత్యర్థులెవరు? ఇప్పుడిదే అంశం హాట్‌ టాపిక్‌గా మారింది. చిలకలూరిపేట బహిరంగసభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలే దీనికి కారణమైంది. కాంగ్రెస్‌, వైసీపీ వేర్వేరు కాదంటూ.. ఆయన చేసిన ఆరోపణలు స్టేట్‌ పాలిటిక్స్‌ సరికొత్త చర్చకు దారితీశాయి. మరి ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..

AP News: ఏపీ రాజకీయాల్లో కాకరేపుతోన్న ప్రధాని మోదీ కామెంట్స్.. ఎవరు మిత్రులు.? ఎవరు శత్రువులు.?
Big News Big Debate

Updated on: Mar 21, 2024 | 7:04 PM

ఏపీ రాజకీయాల్లో ఎవరికెవరు ఏమవుతారు? మిత్రులెవరు? ప్రత్యర్థులెవరు? ఇప్పుడిదే అంశం హాట్‌ టాపిక్‌గా మారింది. చిలకలూరిపేట బహిరంగసభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలే దీనికి కారణమైంది. కాంగ్రెస్‌, వైసీపీ వేర్వేరు కాదంటూ.. ఆయన చేసిన ఆరోపణలు స్టేట్‌ పాలిటిక్స్‌ సరికొత్త చర్చకు దారితీశాయి. కౌంటర్‌గా వైసీపీ కూడా అదే స్థాయిలో రిప్లయ్‌ ఇవ్వడంతో.. ఈ అంశం మరింత మంట రాజేస్తోంది.

ఏపీ ఎన్నికల ప్రచారంలోకి మోదీ ఎంట్రీ ఒకెత్తయితే.. ప్రత్యర్థులను టార్గెట్‌ చేస్తూ చిలకలూరిపేట సభలో ఆయన చేసిన కామెంట్స్ మరో ఎత్తు. వైసీపీ, కాంగ్రెస్‌ ఒక్కటేనంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు.. పెద్దదుమారమే రేపుతున్నాయి. కాంగ్రెస్‌, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లను ఒకే కుటుంబం నడిపిస్తోందంటూ.. ప్రధాని చేసిన కామెంట్స్‌ ఒక్కసారిగా కాకరేపాయి. దీనిపై అదేస్థాయిలో స్పందించింది అధికార వైసీపీ. నోటాతో పోటీపడే కాంగ్రెస్‌తో కూడా చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారనే విషయాన్ని గుర్తు చేసింది. షర్మిల కూడా చంద్రబాబుతో కలిసి పనిచేస్తున్నారన్న సజ్జల.. ఆమె ఏపీసీసీ అధ్యక్షురాలు ఎలా అయ్యారో, ఆమె ప్రసంగాలకు స్క్రిప్ట్‌ ఎక్కణ్నుంచి వస్తుందో అందరికీ తెలుసన్నారు.

అయితే, కాంగ్రెస్‌ మాత్రం.. బీజేపీకి బాబు, జగన్‌, పవన్‌ అనే ఫుల్‌ఫామ్‌ను కన్‌ఫామ్‌ చేసేసింది. ఆ మూడు పార్టీలూ ఒక్కటేనని ఆరోపిస్తోంది. ఏపీకి అన్యాయం చేసిన బీజేపీతో అంటకాగుతున్నారని విమర్శలు గుప్పిస్తోంది. రాష్ట్రానికి అవసరమైన అంశాలను వదిలేసి.. పనికిరాని విషయాలపై మాట్లాడుతున్నారంటూ సజ్జలకు కౌంటరిచ్చారు షర్మిల. ఎవరి వెర్షన్‌ ఎలా ఉన్నా, ప్రధానపార్టీలు చేసుకుంటున్న ఈ పరస్పర విమర్శలు, ఆరోపణలు.. ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపుతున్నాయి. ఇది ఎన్నికల్లో ఎవరికి లాభిస్తుందో? నష్టం చేస్తుందో? చూడాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..