పైనాపిల్‌తో ఆరోగ్యం.. కానీ వీరికి మాత్రం విషంతో సమానం!
samatha
Pic credit - Instagram
పైనాపిల్ ఆరోగ్యానికి మంచిది. అంతే కాకుండా దీని రుచి కూడ చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకే చాలా మంది పైనాపిల్ తినడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు.
అంతే కాకుండా పైనాపిల్‌లో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అయితే ఇది ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, కొందరు వీటిని తినడం అస్సలే మంచిది కాదంట. వారు ఎవరంటే?
మధుమేహం సమస్యతో బాధపడే వారు అస్సలే పైనాపిల్ తినకూడదంట. ఇందులో సహజ చక్కెర అధికంగా ఉంటుంది. అందువలన ఇది రక్తంలోని చక్కెర స్థాయులను వేగంగా పెంచుతుందంట.
అలెర్జీ సమస్యలతో బాధపడే వారు కూడా అస్సలే పైనాపిల్ ఎక్కువ తినకూడదంట. దీని వలన చర్మంపై దుద్దర్లు వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు తలెత్తుతాయంట.
వీలైనంత వరకు గర్భిణీలు పైనాపిల్ తినకపోవడమే మంచిది అని చెబుతున్నారు వైద్య నిపుణులు. ఇందులో ఎక్కువగా బ్రోమెలైన్ అనే సహజ ఎంజైమ్ ఉండటం వలన ఇది కడుపు సంబంధ సమస్యలకు కారణం అవుతుందంట.
పైనాపిల్‌లో పొటాషియం, ఆక్సలేట్లు ఎక్కువగా ఉంటాయి. అందువలన కిడ్నీల్లో రాళ్ల సమస్యతో బాధపడే వారు పైనాపిల్‌కు ఎంత దూరం ఉంటే అంత మంచిదంట.
గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు ఉన్నవారు కూడా పైనాపిల్ ఎక్కువగా తీసుకోకూడదంట. దీని వలన కడుపు నొప్పి, వంటి సమస్యలు అధికం అవుతాయంట.
అలాగే అధిక రక్తపోటు సమస్యతో బాధపడే వ్యక్తులు కూడా పైనాపిల్ తినకూడదంట. ఇందులో పొటాషియం ఎక్కువ మోతాదులో ఉండటం వలన ఇది రక్తపోటు పై ప్రభావం చూపుతుందంట.