మూడు రాజధానుల ఏర్పాటు దిశగా అధికార వైఎఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూకుడు ఏమాత్రం తగ్గించలేదు. విశాఖకు తరలి వెళ్లడంపై తొలిసారిగా దేశ రాజధానిలో ప్రకటించిన సీఎం.. తాజాగా కేబినెట్లో కూడా వెరీ క్లియర్‌గా చెప్పేశారు. జులైలో విశాఖకు వెళుతున్నామంటూ మంత్రి వర్గ సమావేశంలో సంకేతాలు ఇచ్చారు. అయితే లీగల్‌గా ఉన్న సవాళ్ల నేపథ్యంలో ప్రస్తుతానికి బిల్లు పెట్టకపోయినా సీఎం క్యాంపు కార్యాలయం మాత్రం విశాఖకు మారుతుందంటున్నారు వైసీపీ నాయకులు. అందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.
జులైలో విశాఖపట్నానికి తరలివెళ్లనున్నట్లు ప్రకటించారు సీఎం జగన్మోహన్‌రెడ్డి. జులైలో విశాఖపట్నం నుంచి పరిపాలన సాగుతుందని ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో జరిగిన మంత్రివర్గ భేటీలో ఈ వ్యాఖ్యలు చేశారు.
వాస్తవానికి గత కొంతకాలంగా విశాఖపై పదేపదే ప్రకటనలు చేస్తున్నారు మంత్రులు. సీఎం కూడా స్వయంగా విశాఖ వెళుతున్నామంటూ ప్రకటించారు. ఈ నేపథ్యంలో గవర్నర్ ప్రసంగంలో దీనిపై స్పష్టమైన ప్రకటన ఉంటుందని అంతా భావించారు. కానీ అందులో వికేంద్రీకరణ ప్రస్తావించినా జిల్లాలకే పరిమితం చేశారు. మూడు రాజధానుల అంశం అందులో పేర్కొనలేదు. దీంతో విపక్షాలు ఒక్కసారిగా టార్గెట్ చేశాయి. ప్రభుత్వ విధానం మూడు రాజధానులు అయితే… ఎందుకు గవర్నర్ ప్రసంగంలో పెట్టలేదని ప్రశ్నించాయి. దీనికి అంతే స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇచ్చినా కూడా గవర్నర్ ప్రసంగం విషయంలో సాంకేతిక కారణాలతో ఇవ్వలేకపోయామంటోంది వైసీపీ.
గతంలోనూ పలుమార్లు విశాఖ విషయంలో సీఎం స్పష్టత ఇచ్చారు. గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి… విశాఖకు త్వరలో షిఫ్ట్ అవుతున్నట్టు ప్రకటించారు. ఇటీవల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా
ప్రస్తుతానికి సీఎం షిఫ్ట్ అవుతున్నట్టు ప్రకటించినా కూడా లీగల్ ఇష్యూస్ క్లియర్ కాగానే మొత్తం పరిపాలనా రాజధానిని విశాఖకు తరలించే అవకాశం ఉందంటున్నారు వైసీపీ నాయకులు.