టీడీపీ జనసేన కూటమి.. తాడేపల్లిగూడెంలో నిర్వహించిన జెండా సభ ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఒకే వేదికపై నుంచి పవన్, చంద్రబాబు.. ఎన్నికల సమరశంఖాన్ని పూరించడం.. స్టేట్ పాలిటిక్స్‌ను షేక్ చేస్తోంది. ముఖ్యంగా ఈ భారీ బహిరంగసభలో పవన్ చేసిన వ్యాఖ్యలు… సంచలనం రేపుతున్నాయి. పార్టీలకు అతీతంగా కొత్త అలజడిని సృష్టించాయి. రాష్ట్రవ్యాప్తంగా పవర్‌స్టార్ కామెంట్స్‌పైనే పవర్‌ఫుల్ చర్చ జరుగుతోందిప్పుడు. ప్రత్యర్థి పార్టీలతో పాటు సొంత సామాజిక వర్గం నుంచి కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండటంతో.. ఇది కులజడిగా కూడా మారిపోయినట్టు కనిపిస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..