AP Cyclone: ఏపీ ప్రజలకు అలర్ట్‌.. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. భారీ తుఫాను ముప్పు!

|

Nov 22, 2024 | 2:51 PM

AP Cyclone: అల్పపీడన ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. అల్పపీడనం క్రమంగా తుఫానుగా బలపడేందుకు పరిస్థితులు అనుకూలంగా

AP Cyclone: ఏపీ ప్రజలకు అలర్ట్‌.. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. భారీ తుఫాను ముప్పు!
Follow us on

ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి తుఫాను గండం పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. బంగాళాఖాతంలో మంగళవారం ఏర్పడే అల్పపీడనంతో దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి హెచ్చరించింది. దక్షిణ అండమాన్‌ సమీపంలో గురువారం ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. తర్వాత రెండు రోజుల్లో అది వాయుగుండంగా బలపడుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

నిన్నటి భూమధ్యరేఖ హిందూ మహాసముద్రం, కోస్తా తీరం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రంలో ఉన్న ఉపరితల ఆవర్తనం పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి తూరుపు భూమధ్యరేఖ హిందూ మహాసముద్రం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రం వరకు విస్తరించింది. దీని ప్రభావంతో నవంబర్ 23 తేదీకల్లా ఆ గ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఇది తర్వాత పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి తదుపరి 2 రోజుల్లో దక్షిణ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య, గాలులు వీయనున్నాయి. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం ,దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ మరియు రాయలసీమలలో ఈరోజు, రేపు, ఎల్లుండి వాతావరణము పొడిగా ఉండే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

అల్పపీడన ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. అల్పపీడనం క్రమంగా తుఫానుగా బలపడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి