AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tiger Tension: ప్రజలను బెంబేలేత్తిస్తున్న బెంగాల్ టైగర్.. అధికారుల అంచనాలకు అందని పులి కదలికలు

ట్రాప్ కేజ్ లో పడకుండా తెలివిగా పెద్దపులి సంచరిస్తోంది. పులి కదలికలు అసలు అధికారుల అంచనాలకు అందడం లేనట్లు తెలుస్తోంది.  మరోవైపు అనేక గ్రామ ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు.

Tiger Tension: ప్రజలను బెంబేలేత్తిస్తున్న బెంగాల్ టైగర్.. అధికారుల అంచనాలకు అందని పులి కదలికలు
File Photo
Surya Kala
|

Updated on: Sep 03, 2022 | 11:22 AM

Share

Tiger Tension in Vizianagaram District: విజయనగరం జిల్లా వాసులను రాయల్ బెంగాల్ టైగర్ వణికిస్తోంది.  మన్యం అడవుల సమీప గ్రామాల్లో తిరుగుతూ స్థానికులను భయబ్రాంతులకు గురి చేస్తోంది.  పులి జాడ తెలిసిన ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తమవుతున్నారు.. పులిని బంధించేందుకు అధికారుల విశ్వప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.  తాజాగా పులి జాడను గుర్తించిన అటవీశాఖ అధికారులు బొండపల్లి మండలం మూలపాడు సమీపంలో టైగర్ ట్రాప్ కేజ్ ఏర్పాటు చేశారు. పులి ట్రాప్ కేజ్ లో పడుతుందని రాత్రంతా అధికారులు ఉత్కంఠగా ఎదురుచూశారు. అయితే బెంగాల్ టైగర్ నేను మీ కంటే తెలివైనదానిని అంటూ కనీసం ట్రాప్ కేజ్ సమీపంలో కూడా సంచరించడం లేనట్లు తెలుస్తోంది. ట్రాప్ కేజ్ లో పడకుండా తెలివిగా పెద్దపులి సంచరిస్తోంది. పులి కదలికలు అసలు అధికారుల అంచనాలకు అందడం లేనట్లు తెలుస్తోంది.

మరోవైపు అనేక గ్రామ ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. ఎప్పుడు ఎవరి పై పులి దాడి చేసి ప్రాణాలు తీస్తుందో అని వణికిపోతున్నారు. రాత్రింబవళ్లు గ్రామాల చుట్టు పహారా కాస్తున్నారు. కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..