Andhra Pradesh: ఉత్కంఠ రేపుతున్న అన్నా క్యాంటీన్ వివాదం.. ఆసక్తిగా మారుతున్న అధికారుల తీరు.. నెక్స్ట్ ఏంటో..

గుంటూరు జిల్లా తెనాలిలో (Tenali) అన్నా క్యాంటీన్ వివాదం తీవ్ర ఉద్రిక్తత రేపుతోంది. మున్సిపల్ సిబ్బంది ఇచ్చిన నోటీసులనూ లెక్క చేయకుండా టీడీపీ నేతలు క్యాంటీన్‌ను యథావిధిగా నిర్వహించారు. మార్కెట్ సమీపంలోని ఎన్టీఆర్...

Andhra Pradesh: ఉత్కంఠ రేపుతున్న అన్నా క్యాంటీన్ వివాదం.. ఆసక్తిగా మారుతున్న అధికారుల తీరు.. నెక్స్ట్ ఏంటో..
Anna Canteen
Follow us

|

Updated on: Sep 03, 2022 | 9:28 AM

గుంటూరు జిల్లా తెనాలిలో (Tenali) అన్నా క్యాంటీన్ వివాదం తీవ్ర ఉద్రిక్తత రేపుతోంది. మున్సిపల్ సిబ్బంది ఇచ్చిన నోటీసులనూ లెక్క చేయకుండా టీడీపీ నేతలు క్యాంటీన్‌ను యథావిధిగా నిర్వహించారు. మార్కెట్ సమీపంలోని ఎన్టీఆర్ విగ్రహం దగ్గర రోజులాగే క్యాంటిన్‌ నడిపించారు. క్యాంటిన్ ఎత్తివేయాలంటూ మున్సిపల్ అధికారులు వస్తారని భావించిన టీడీపీ (TDP) శ్రేణులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నాయి. అయితే మున్సిపల్ అధికారులు మాత్రం అటు వైపు రాకపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో ఎలాంటి ఆటంకాలు లేకుండా భోజనం అందించారు. 20 రోజులుగా మార్కెట్ సెంటర్‌లో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ నడుస్తోంది. పేదలకు ఉచితంగా అన్నదానం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం ఆల్ ఆఫ్‌ సడెన్‌గా మున్సిపల్ అధికారులు ఎంట్రీ ఇచ్చారు. ట్రాఫిక్ అంతరాయం కలుగుతోందని, అన్నా క్యాంటీన్‌ను మరో చోటికి మార్చుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదూ నోటీసులు కూడా ఇచ్చారు. అయితే టీడీపీ నేతలు మాత్రం అన్నా క్యాంటిన్‌ను తరలించేదే లేదని తెగేసి చెప్పారు. అంతటితో ఆగకుండా నోటీసులను బేఖాతరు చేస్తూ క్యాంటీన్ నిర్వహించారు.

కాగా.. గతంలో టీడీపీ, మునిసిపల్ అధికారుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. అయితే మధ్యాహ్నం కేవలం ఒక గంట వ్యవధిలోపే అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ తీసేయమనడం దారుణమని టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. అన్నా క్యాంటీన్ పై వివక్ష తగదని సూచిస్తున్నారు. ఈ పరిణామాల మధ్య శుక్రవారం అన్నా క్యాంటీన్ సజావుగా నడవడంపై మున్సిపల్ అధికారులు వెనక్కి తగ్గినట్టేనా? ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారించారా? లేదంటే మరో అస్త్రంతో ముందుకొస్తారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా టీడీపీ నేతలు మాత్రం అన్నా క్యాంటీన్‌ అడ్డా మార్చబోమని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం

ఈ ముసుగుల్లో ఉన్న ఇద్దరూ మాములు ముదుర్లు కాదు..
ఈ ముసుగుల్లో ఉన్న ఇద్దరూ మాములు ముదుర్లు కాదు..
వైఎస్ జగన్ - షర్మిల ఆస్తులపై షాకింగ్ స్పష్టత ఇచ్చిన వైఎస్ విజయమ్మ
వైఎస్ జగన్ - షర్మిల ఆస్తులపై షాకింగ్ స్పష్టత ఇచ్చిన వైఎస్ విజయమ్మ
దీపావళికి ఆఫర్‌.. రూ. 699కే 4జీ ఫోన్‌.! ఓటీటీ ప్లాన్స్ లో కూడా..
దీపావళికి ఆఫర్‌.. రూ. 699కే 4జీ ఫోన్‌.! ఓటీటీ ప్లాన్స్ లో కూడా..
వెయ్యి కోట్లకు ఒక్క రూపాయి తక్కువైనా తగ్గేదే లే.! మహేష్ రాజమౌళి
వెయ్యి కోట్లకు ఒక్క రూపాయి తక్కువైనా తగ్గేదే లే.! మహేష్ రాజమౌళి
ఇక నుంచి ఆహా గోల్డ్‌ బాధ్యత మనోడిదే.! ప్రోమో వీడియో వైరల్..
ఇక నుంచి ఆహా గోల్డ్‌ బాధ్యత మనోడిదే.! ప్రోమో వీడియో వైరల్..
తారే జమీన్ పర్‌ బుడ్డోడు.. ఇప్పుడు హీరోగా వచ్చాడు తెలుసా.!
తారే జమీన్ పర్‌ బుడ్డోడు.. ఇప్పుడు హీరోగా వచ్చాడు తెలుసా.!
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. OTTలోకి దేవర.! డేట్ ఫిక్స్..
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. OTTలోకి దేవర.! డేట్ ఫిక్స్..
జాక్‌ పాట్ కొట్టేసిన మోహబూబ్‌.! ఉన్న 3 వారాలకి హై రెమ్యునరేషన్..
జాక్‌ పాట్ కొట్టేసిన మోహబూబ్‌.! ఉన్న 3 వారాలకి హై రెమ్యునరేషన్..
వేణు స్వామికి బిగ్ షాక్.! అరెస్ట్ తప్పదా.? నాగచైతన్య- శోభితలపై..
వేణు స్వామికి బిగ్ షాక్.! అరెస్ట్ తప్పదా.? నాగచైతన్య- శోభితలపై..
భారీ ప్రమాదం, ముఖానికి 20 కుట్లు.. నటి ఎమోషనల్ వీడియో.!
భారీ ప్రమాదం, ముఖానికి 20 కుట్లు.. నటి ఎమోషనల్ వీడియో.!