Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vinayaka Chavithi: గణపతి చేతిలో లడ్డును ఎత్తుకెళ్ళిన దొంగ.. సీసీటీవీ కెమెరాలో రికార్డు.. దర్యాప్తు చేస్తోన్న పోలీసులు

భక్తులు చవితి ఉత్సవాలను ఉత్సాహంగా జరుపుకుంటూ ఎంజాయ్ చేస్తుంటే.. దొంగలు మాత్రం తమ వృత్తి ధర్మాన్ని పాటిస్తున్నారు, మంచి తరుణం మించిన రాదంటూ గణేష్ మండపంపై ఓ కన్నీసి ఉంచారు.

Vinayaka Chavithi: గణపతి చేతిలో లడ్డును ఎత్తుకెళ్ళిన దొంగ.. సీసీటీవీ కెమెరాలో రికార్డు.. దర్యాప్తు చేస్తోన్న పోలీసులు
Stealing Laddu From Ganapat
Follow us
Surya Kala

|

Updated on: Sep 03, 2022 | 1:33 PM

Vinayaka Chavithi: దేశ వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఢిల్లీ నుంచి గల్లీ వరకూ కొలువుదీరిన మండపాల్లో గణపతి పూజలను అందుకుంటున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో వినాయక విగ్రహానికి ఎంత ప్రాధాన్యత ఉందో ఆయన చేతిలో పెట్టె లడ్డు ప్రసాదానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. గణపతితో పాటు.. లడ్డుకూడా నవరాత్రులు భక్తులతో పూజలను అందుకుంటుంది. భక్తులు చవితి ఉత్సవాలను ఉత్సాహంగా జరుపుకుంటూ ఎంజాయ్ చేస్తుంటే.. దొంగలు మాత్రం తమ వృత్తి ధర్మాన్ని పాటిస్తున్నారు, మంచి తరుణం మించిన రాదంటూ గణేష్ మండపంపై ఓ కన్నీసి ఉంచారు. తాజాగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో గణేష్ మండపంలో దొంగ ఏమి ఎత్తుకెళ్లాడో తెలుసా..!

నంద్యాల టుటౌన్ సమీపంలో గణపతి మండపాన్ని ఏర్పాటు చేసి.. భారీ గణపతి ప్రతిమకు భక్తులు అత్యంత భక్తి శ్రద్దలతో పూజలను నిర్వహిస్తున్నారు. పూజలో భాగంగా నాయకుడి చేతిలో లడ్డుని కూడా ప్రసాదంగా పెట్టారు. ఈ లడ్డుని నవరాత్రుల అనంతరం.. వేలం పాటలో దక్కించుకోవడానికి భక్తులు పోటీ పడతారు. వేలంలో ఈ లడ్డూను దక్కించుకుంటే కుటుంబానికి సిరి సంపదలు, ఆయురారోగ్యాలు చేకూరుతాయని భక్తులు విశ్వసిస్తారు.

ఈ నేపథ్యంలో వినాయకుడి చేతిలో ఉంచిన లడ్డును ఓ దొంగ ఎత్తుకెళ్లాడు.  ఇద్దరు యువకులు అర్ధరాత్రి బైక్ మీద మండపం దగ్గరకు వచ్చారు. వారిలో ఒక యువకుడు.. గణపతి దగ్గరకు వెళ్లి.. లడ్డుని తీసుకుని వెళ్ళాడు. ఆ సమయంలో సీసీ టీవీ కెమెరాలో దృశ్యాలు రికార్డు అయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..