AP News: కూటమి నేతల్లో వర్గపోరు.. పొలింగ్‎కు ముందు అనూహ్య పరిణామం..

మరో 48గంటల్లో ఏపీ పోలింగ్‌కి అంతా సిద్దమవుతున్నా.. కూటమి నేతల్లో మాత్రం లొల్లి కంటిన్యూ అవుతోంది. పి.గన్నవరంలో టీడీపీ, జనసేన నేతలు బాహబాహీకి దిగారు. ఏపీలో ప్రచారం పర్వం నేటితో ముగుస్తోంది. మరి కొద్ది గంటల్లో మైకులు ముగబోనున్నాయి. ఏపీ ఎన్నికల సంగ్రామంలో మరో 48గంటల్లో ఓట్ల పండుగ జరగనుంది. ప్రచారంపర్వం ముగుస్తున్నా.. కూటమి కార్యకర్తల్లో మాత్రం ఇంకా లొల్లి కొనసాగుతోంది. ముఖ్యంగా పి.గన్నవరంలో నియోజకవర్గంలో మొదటినుంచి కూటమి కార్యకర్తల్లో సమన్వయం లోపించింది.

AP News: కూటమి నేతల్లో వర్గపోరు.. పొలింగ్‎కు ముందు అనూహ్య పరిణామం..
Janasena Vs Tdp

Updated on: May 11, 2024 | 7:15 AM

మరో 48గంటల్లో ఏపీ పోలింగ్‌కి అంతా సిద్దమవుతున్నా.. కూటమి నేతల్లో మాత్రం లొల్లి కంటిన్యూ అవుతోంది. పి.గన్నవరంలో టీడీపీ, జనసేన నేతలు బాహబాహీకి దిగారు. ఏపీలో ప్రచారం పర్వం నేటితో ముగుస్తోంది. మరి కొద్ది గంటల్లో మైకులు ముగబోనున్నాయి. ఏపీ ఎన్నికల సంగ్రామంలో మరో 48గంటల్లో ఓట్ల పండుగ జరగనుంది. ప్రచారంపర్వం ముగుస్తున్నా.. కూటమి కార్యకర్తల్లో మాత్రం ఇంకా లొల్లి కొనసాగుతోంది. ముఖ్యంగా పి.గన్నవరంలో నియోజకవర్గంలో మొదటినుంచి కూటమి కార్యకర్తల్లో సమన్వయం లోపించింది. ఇక్కడ నుంచి జనసేన అభ్యర్థి పోటీ చేస్తుడడంతో జనసేన, టీడీపీ కార్యకర్తల మధ్య వర్గవిభేదాలు అక్కడక్కడ బయటపడుతూనే ఉన్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి లంకలో టీడీపీ, జనసేన కార్యకర్తలు బాహాబాహికి దిగారు. కూటమి సమావేశం రసాభాసగా మారింది.

అయినవిల్లి లంకలో ఎంపి అభ్యర్థి హరీష్ మాధుర్ అధ్యక్షతన కూటమి సమావేశం జరిగింది. ఈసమావేశంలో స్టేజిపైకి జనసేన నేతలను పిలవకపోవడంతో వివాదం రాజుకుంది. స్టేజిపై స్థానం లేనప్పుడు తమను ఎందుకు పిలిచారంటూ జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ అభ్యర్థి హరీష్ మాధుర్‌ ముందే బాహాబాహికి దిగారు. సమావేశం నుంచి ఆగ్రహంతో బయటకు వెళ్లిపోయారు జనసేన కార్యకర్తలు, నేతలు. వెంటనే హరీష్‌మాధుర్‌ కలుగజేసుకొని జనసేన నేతలకు నచ్చచెప్పారు. వారిని బుజ్జగించి స్టేజి దగ్గరకు తీసుకొచ్చారు. కమిటీని వేసి మరోసారి ఎలాంటి విభేదాలు రాకుండా సర్ధుబాటు చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో అయినవిల్లి లంకలో గొడవ ఎట్టకేలకు సర్ధుమణింది. ఇక ఇదే నియోజకవర్గంలోని చాకలిపాలెంలోను సేమ్‌ సీన్ రిపీట్ అయింది. చాకలిపాలెంలోని పంక్షన్‌ హాలులో కూటమి నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలోను నేతల మధ్య సమన్వయం లోపించింది. కూటమి కార్యకర్తల మధ్య మాటమాట పెరిగి ఒకరినొకరు తోసుకున్నారు. దీంతో సమావేశం కాస్తా రాసాబాసగా మారింది. పోలింగ్ టైం దగ్గపడ్డా కూటమిలో లొల్లి కంటిన్యూ కావడంతో నేతలు తలలుపట్టుకుంటున్నారు.