Sea Level Rise: అంతర్వేది వద్ద సముద్రం అల్లకల్లోలం.. 25 మీటర్లు ముందుకొచ్చి బీభత్సం.. 20 ఏళ్లకు ఒకసారి ఇలా జరుగుతుందట

|

Aug 12, 2021 | 11:32 AM

Sea Level Rise: బంగాళాఖాత సముద్రం గోదావరి నది సంగమ ప్రాంతం అంతర్వేది. తూర్పుగోదావరి జిల్లా సఖినేటి పల్లిలోని పవిత్ర పుణ్యక్షేత్రం అంతర్వేది. ఈ త్రికోణాకారపు దీవి పై లక్ష్మీ నరసింహ స్వామి కొలువై భక్తులతో పూజలను..

Sea Level Rise: అంతర్వేది వద్ద సముద్రం అల్లకల్లోలం.. 25 మీటర్లు ముందుకొచ్చి బీభత్సం.. 20 ఏళ్లకు ఒకసారి ఇలా జరుగుతుందట
Antarvedi
Follow us on

Sea Level Rise: బంగాళాఖాత సముద్రం గోదావరి నది సంగమ ప్రాంతం అంతర్వేది. తూర్పుగోదావరి జిల్లా సఖినేటి పల్లిలోని పవిత్ర పుణ్యక్షేత్రం అంతర్వేది. ఈ త్రికోణాకారపు దీవి పై లక్ష్మీ నరసింహ స్వామి కొలువై భక్తులతో పూజలను అందుకున్నాడు. తాజాగా అంతర్వేది సముద్ర తీరం దగ్గర ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది. అంతర్వేది బీచ్‌లో సముద్రం వున్నట్టుండి ముందుకు చొచ్చుకు వచ్చింది. అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. సముద్రం ముందుకొచ్చి దాదాపు తీరమంతా మునిగిపోయి నీరే కనిపిస్తోంది.

సముద్రం ఒకటి కాదు రెండు కాదు.. 25 మీటర్ల మేర ముందుకొచ్చింది. దీంతో స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు. అటు అలల తాకిడితో అక్కడే వున్న రెసిడెన్షియల్‌ భవనం ధ్వంసమైంది.. అలల ఉధృతికి కింద నేలంతా కొట్టుకుపోవడంతో బిల్డింగ్‌ ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే ప్రమాద సమయంలో భవనంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. 70 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లుగా అంచనా వేస్తున్నారు.

ఇలా సముద్రం ముందు రావడం, భీకర అలలు ఏర్పడడం 20 ఏళ్లకు ఒకసారి మాత్రమే జరుగుతుందని స్థానికులు చెబుతున్నారు. అయితే ఇలా జరగడానికి కారణం తెలియదని అంటున్నారు. అయితే అంతర్వేదిలో సముద్రములో వశిష్ట నది కలిసే చోటును అన్న చెళ్ళెళ్ళ గట్టు అంటారు. ఇక్కడ సముద్ర నీటి మధ్య కొంత భాగం గట్టు మాదిరిగా పొడవుగా ఇసుకమేట వేసి ఉంటుంది. దానికి అటువైపు ఇటువైపు నీరు వేరువేరు రంగులలో ఒకవైపు స్వచ్ఛంగా, మరొకవైపు మట్టిగా కనిపిస్తుంది. సముద్ర ఆటు పోటులలో కూడా ఇలాగే ఉండటం ఇక్కడి ప్రత్యేకత. వశిష్టానది సముద్రంలో కలిసే ప్రాంతం నుండి మొదలయ్యే అంతర్వేది సముద్రతీరం దాదాపు నాలుగు కిలోమీటర్లమేర ఉంటుంది. సర్వితోటలు, సముద్రపు మొక్కలతోనూ అందంగా ఉండే తీరం ఇప్పుడు అల్లకల్లోలంగా మారింది.

Also Read: వృద్ధ దంపతుల మధ్య తెలెత్తిన ఘర్షణ.. భార్యని చంపి.. భయంతో ఆత్మహత్య చేసుకున్న భర్త