Badvel By-Election Winner: జగన్ కంటే ఎక్కువ మెజార్టీతో గెలిచిన డాక్టర్ సుధ.. అద్భుత విజయం

| Edited By: Janardhan Veluru

Nov 02, 2021 | 3:39 PM

బద్వేల్ ఉప ఎన్నికలో వైసీపీ బంపర్ మెజార్టీతో విక్టరీ కొట్టింది. బరిలో నిలిచిన కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్స్ కూడా గల్లంతయ్యాయి.

Badvel By-Election Winner: జగన్ కంటే ఎక్కువ మెజార్టీతో గెలిచిన డాక్టర్ సుధ.. అద్భుత విజయం
Badvel By-Election Winner Doctor Sudha
Follow us on

బద్వేల్ ఉప ఎన్నికలో వైసీపీ బంపర్ మెజార్టీతో విక్టరీ కొట్టింది. బరిలో నిలిచిన కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్స్ కూడా గల్లంతయ్యాయి. బద్వేల్‌లో మొత్తం 13 రౌండ్ల కౌంటింగ్‌ ముగిసేసరికి వైసీపీ అభ్యర్థి సుధ 90, 533 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. మొత్తం వ్యాలీడ్ ఓట్లు 1,47,163 కాగా.. వైసీపీకి 1,12,211 ఓట్లు పోలయ్యాయి. బీజేపీకి 21,678 ఓట్లు రాగా, కాంగ్రెస్‌కు మొత్తం 6,235 ఓట్లు వచ్చాయి. నోటాకు 3,650 ఓట్లు పోల్ అయ్యాయి. డాక్టర్ సుధకు వచ్చిన మెజార్టీ వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌కు గతంలో వచ్చిన మెజార్టీ కంటే కూడా ఎక్కువ కావడం విశేషం. 2019 ఎన్నికల్లో జగన్ పులివెందుల అసెంబ్లీ నియోజవర్గం నుంచి  90,110 ఓట్ల మెజార్టీతో గెలిపొందారు. మొత్తం పోలైన 1,80,127 ఓట్లలో జగన్మోహన్ రెడ్డికి 1,32,356 ఓట్లు వచ్చాయి.  2014 ఎన్నికల్లో జగన్‌కు 75243 ఓట్ల మెజార్టీ వచ్చింది.

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సుపరిపాలన, ఆయన అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలే తనను గెలిపించాయన్నారు డాక్టర్ సుధ. తన విజయానికి సహకరించిన వైసీపీ నేతలకు, బద్వేల్‌ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. బద్వేల్‌లో భారీ మెజారిటీతో గెలుపొందిన వైసీపీ అభ్యర్థి సుధ ఎన్నికల అధికారి నుంచి డిక్లరేషన్‌ తీసుకున్నారు.

బద్వేల్‌లో భారీ విజయాన్ని సాధించడంపై ఆనందం వ్యక్తం చేశారు వైసీపీ నేతలు. సీఎం జగన్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్లే భారీ విజయం సాధించగలిగామని తెలిపారు. 2024 ఎన్నికల్లోనూ ఇదే ఫలితాలు రిపీట్‌ అవుతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు.

Also Read: Anchor Suma: వెండితెరపైకి బుల్లితెర లేడీ సూపర్‌స్టార్ సుమ.. వీడియో విడుదల

Raghuveera Reddy: మాజీ మంత్రి రఘువీరా.. ఏంటిలా.. నెట్టింట వైరల్‌గా మారిన ఫోటో