Visakhapatnam: యాక్.. ఇలాంటి చికెన్ ఫ్రై తింటే డైరెక్ట్ గా హాస్పిటల్ కే.. అధికారుల తనిఖీల్లో విస్తుపోయే వాస్తవాలు..

| Edited By: Shaik Madar Saheb

Feb 25, 2023 | 6:59 PM

మీరు ఫ్రై చికెన్ తినేందుకు ఇష్టపడుతున్నారా...? ఫ్రైడ్ చికెన్ సెంటర్లకు వెళ్లి క్యూ కొడుతున్నారా...? వేడివేడిగా అక్కడ వడ్డించిన ఆహారాన్ని లొట్టలు వేసుకుని లొట్టలేసుకుని తింటున్నారా...? ఆహా ఏమి టేస్ట్..

Visakhapatnam: యాక్.. ఇలాంటి చికెన్ ఫ్రై తింటే డైరెక్ట్ గా హాస్పిటల్ కే.. అధికారుల తనిఖీల్లో విస్తుపోయే వాస్తవాలు..
Visakhapatnam Raids
Follow us on

మీరు ఫ్రై చికెన్ తినేందుకు ఇష్టపడుతున్నారా…? ఫ్రైడ్ చికెన్ సెంటర్లకు వెళ్లి క్యూ కొడుతున్నారా…? వేడివేడిగా అక్కడ వడ్డించిన ఆహారాన్ని లొట్టలు వేసుకుని లొట్టలేసుకుని తింటున్నారా…? ఆహా ఏమి టేస్ట్ గురు అంటూ ముక్క మీద ముక్క లాగించేస్తున్నారా..? అయితే కాస్త ఇప్పుడు ఆలోచించాల్సిందే..! ఎందుకంటే మీరు తినే ఫ్రై చికెన్ లో విషం ఉంటుందనే విషయం ఎంతమందికి తెలుసు…? పదే పదే వేయించిన నూనెలో ఫ్రై చేస్తూ కొంత మంది నిర్వాహకులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నాణ్యతలేని నూనెలో చికెన్ ఫ్రై చేసి వండి వడ్డిస్తున్నారు. ఇటువంటి ఫ్రై చికెన్ తింటే… టేస్ట్ మాట దేవుడెరుగు… మీరు క్యాన్సర్ బారిన పడటం ఖాయం అంటున్నారు అధికారులు.

అవును.. విశాఖలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీల్లో ఇటువంటి విషయమే వెలుగులోకి వచ్చింది. ద్వారకా నగర్ కేఎఫ్సీలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు చేశారు. పదే పదే వినియోగించిన నూనెలో చికెన్ ఫ్రై చేస్తున్నట్టు గుర్తించారు. టీపీసీ మీటర్ తో మరుగుతున్న నూనె సాంద్రతను చెక్ చేశారు అధికారులు. దీంతో టీపీసీ మీటర్లో నూనె సాంద్రత 34 నుంచి 37 వరకు రీడింగ్ చూపించింది. దీంతో ఆ నూనెలో వేయిస్తున్న చికెన్ ప్రజల ఆరోగ్యానికి నష్టం చేకూర్చేలా ఉందని నిర్ధారించారు అధికారులు. నూనె సాంద్రత ఎంతలా ఉందంటే.. నూనె వినియోగంలో ఈ కేఎఫ్సీ కంటే పకోడీ వ్యాపారులే బెటర్ అంటున్నరు అధికారులు.

Raids In Visakhapatnam

కేఎఫ్‌సీ స్పందన ఏంటంటే..?

‘‘వినియోగదారులకు అత్యధిక నాణ్యత గల ఉత్పత్తులను అందించడానికి, ఇంకా ఉత్తమమైన పద్ధతులు, అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరించడానికి కెఎఫ్సి ఇండియా కట్టుబడి ఉంది. దేశంలోని ప్రఖ్యాత సరఫరాదారుల నుంచి అధిక నాణ్యత గల నూనె దిగుమతి చేసుకుని ఉపయోగిస్తున్నాం.. KFC రెస్టారెంట్లలో అందించే ఆహారం వినియోగానికి సురక్షితమైనదని నిర్ధారించడానికి కఠినమైన ప్రక్రియలు అనుసరిస్తాం.. ఈ సమస్య గురించి మాకు తెలిసింది. మేము ఇక్కడి చట్టం పట్ల అత్యధిక గౌరవాన్ని కలిగి ఉన్నాము. మేము ఆహార భద్రతపై అన్ని ప్రభుత్వ నియమాలు, నిబంధనలకు కట్టుబడి ఉంటామని కస్టమర్లకు హామీ ఇస్తున్నాం.” అంటూ కేఎఫ్‌సీ ప్రకటనలో తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..