Asani Cyclone – Andhra Pradesh: దూసుకొస్తున్న ‘అసని’.. తీరప్రాంత ప్రజలకు తీవ్ర హెచ్చరికలు చేసిన వాతావరణ శాఖ..!

Asani Cyclone: బంగాళాఖాతంలో అసాని సైక్లోన్ కొనసాగుతోంది ఇది వాయువ్య దిశగా ప్రయాణిస్తూ వస్తోంది. ఉత్తరాంధ్ర, ఒడిశా తీరం వైపునకు..

Asani Cyclone - Andhra Pradesh: దూసుకొస్తున్న ‘అసని’.. తీరప్రాంత ప్రజలకు తీవ్ర హెచ్చరికలు చేసిన వాతావరణ శాఖ..!
Asani Cyclone
Follow us

|

Updated on: May 09, 2022 | 10:05 PM

Asani Cyclone: బంగాళాఖాతంలో అసాని సైక్లోన్ కొనసాగుతోంది ఇది వాయువ్య దిశగా ప్రయాణిస్తూ వస్తోంది. ఉత్తరాంధ్ర, ఒడిశా తీరం వైపునకు దూసుకొస్తోంది. రేపు సాయంత్రానికి ఉత్తరాంధ్ర తీరంకి సమీపంగా వచ్చి ఆ తర్వాత దిశను మార్చుకోను౦ది. 2022లో మొదటిగా తుఫాను అసని ఏపీలో ఉత్తరాంధ్ర తీరంపై ప్రభావం చూపిస్తోంది. రేపు తీవ్ర తుఫానుగా మారి బలహీనపడుతుందని వాతావరణ శాఖ అధికారులంటున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని, రైతులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ డైరెక్టర్ స్టెల్లా హెచ్చరికలు జారీ చేశారు.

అసని తీవ్ర తుపాను అని చెప్పారు. రేపు తుపానుగా బలహీనపడుతుందన్నారు. తుపానుగా మారి వెనక్కి వెళ్లిపోతుందన్నారు. ఉత్తర ఈశాన్య దిశగా తిరిగి ఒడిస్సా తీరం నుంచి వాయువ్య బంగాళాఖాతం వైపు మళ్ళుతుందని స్టెల్లా వెల్లడించారు. తుపానుగా మారాక తీరం వెంబడి 49 నుంచి 59 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని చెప్పారు. రైతులు పంటలు వేసే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

పిడుగులతో మృతి.. ఇదిలాఉంటే, అల్లూరి సీతారామరాజు జిల్లా జీకేవీధి మండలంలో పిడుగులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. మ౦డల౦లోని గాలికొండ పంచాయతీ పరిధి లోని సట్రాపల్లి గ్రామం పిడుగుల థాటికి 12 ఆవులు, దుక్కిటెడ్లు మృతి చెందాయి. సట్రాపల్లికి చెందిన ఆవులు, ఎడ్లను గిరిజనులు మేతకు కొండపైకి తోలుకెళ్ళి అక్కడ విడిచిపెట్టి మధ్యాహ్నం భోజనంకు వచ్చారు. మధ్యాహ్నం నుంచి ఈప్రాంతంలో ఉరుములతో కూడిన భారీ వర్షం పడటంతో బాటు కొండపై పిడుగులు పడటంతో పిడుగుల దాటికి 12 ఆవులు అక్కడికక్కడే మృతి చెందాయి. వర్షం తగ్గిన తరువాత గిరిజనులు కొండపైకి వెళ్ళి పరిశీలించగా ఆవులు, ఎడ్లు మృతి చెందినట్లు గుర్తించారు. గ్రామానికి చెందిన గెమ్మేలి చంద్రరావు. గెమ్మేలి త్రినాధ్, బోడపాట్ల అప్పారావు, కొర్రా బలరామ్, కొర్రా పోతురాజు అనే గిరి జనులకు చెందిన పశువులు మృతి చెందినట్లు గుర్తించారు.