Lance Naik Sai Teja: నేడు స్వగ్రామానికి జవాను సాయితేజ పార్థివదేహం.. సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు

Lance Naik Sai Teja: జవాన్‌ లాన్స్‌నాయక్‌ సాయితేజ పార్థివదేహం ఈ రోజు సొంతూరికి చేరుకుంటుంది. చిత్తూరు జిల్లాలోని స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఇప్పటికే..

Lance Naik Sai Teja: నేడు స్వగ్రామానికి జవాను సాయితేజ పార్థివదేహం.. సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు

Updated on: Dec 12, 2021 | 12:44 AM

Lance Naik Sai Teja: జవాన్‌ లాన్స్‌నాయక్‌ సాయితేజ పార్థివదేహం ఈ రోజు సొంతూరికి చేరుకుంటుంది. చిత్తూరు జిల్లాలోని స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. నిన్న బెంగళూరుకు చేరుకున్న లాన్స్‌నాయక్‌ సాయితేజ పార్థివదేహం.. యలహంక ఎయిర్‌బేస్‌లో పలువురు ఆర్మీ అధికారులు సాయితేజ భౌతికకాయానికి నివాళులర్పించారు. అక్కడి నుంచి బెంగళూరు ఆర్మీ హాస్పిటల్‌కు తరలించారు.

ఈ రోజు ఉదయం 5 గంటలకు బెంగళూరు నుంచి చిత్తూరుకు తరలిస్తారు. ఉదయం 10 గంటలకు స్వగ్రామానికి చేరుకుంటుంది సాయితేజ భౌతికకాయం. ఆ తర్వాత సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు. విధుల్లో భాగంగా వీరమరణం పొందిన సాయితేజ పార్థివ దేహాన్ని ర్యాలీగా స్వగ్రామానికి తరలిస్తామని.. అందుకే ఈ రోజు అంత్యక్రియలు చేపట్టాలని ఆర్మీ అధికారులకు విజ్ఞప్తి చేశామన్నారు సాయితేజ కుటుంబసభ్యులు. మా విజ్ఞప్తికి ఆర్మీ అధికారులు అంగీకరించారని తెలిపారు.

సాయితేజ కుటుంబానికి అండగా నిలిచిన ఏపీ సర్కార్‌

మరోవైపు సాయితేజ కుటుంబానికి అండగా నిలిచింది ఏపీ ప్రభుత్వం. సాయితేజ కుటుంబానికి 50 లక్షల ఆర్థికసాయం ప్రకటించింది. ఆ చెక్కును మంత్రి పెద్దిరెడ్డి సాయితేజ కుటుంబానికి అందించారు. సాయితేజ త్యాగం వెలకట్టలేనిదన్నారు మంత్రి పెద్దిరెడ్డి. సాయితేజ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు సాయితేజ సోదరుడు మహేష్‌. సాయితేజ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి:

Lance Naik Sai Teja: సీడీఎస్ బిపిన్ రావత్ గురించి.. సాయితేజ తన తండ్రితో చెప్పిన కీలక విషయాలు ఇవే

AP: జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. ఆ ప్రాంతాల్లోని మహిళల రుణాలన్నీ మాఫీ