గుంటూరు, అక్టోబర్16; పల్నాడు ప్రాంతం చారిత్రక నేపథ్యం ఉన్న ప్రాంతం… అనేక పురాతన కట్టడాలు, నిర్మాణాలు ఇప్పటికి పల్నాడు ప్రాంతంలో కనిపిస్తాయి. పల్నాటి యుద్దంతో పాటు క్రీస్తు శకం 1000 శతాబ్దం నాటి ఆనవాళ్లు ఇప్పటికీ తారసపడుతుంటాయి. ఈక్రమంలోనే ఈ ప్రాంతంపై ఆర్కియాలజీ నిపుణులు అనేక పరిశోధనలు చేస్తుంటారు. కొప్పునూరులో ఆరు వేల ఏళ్ల నాటి చిత్రాలను పురావస్తు నిపుణుడు ఈమని శివనాగిరెడ్డి గుర్తించారు. వాటిని కాపాడుకోవాల్సిన బాద్యత పౌరులందరిపై ఉందంటున్నారు.
గుంటూరు జిల్లాలోని మాచర్ల మండలం కొప్పునూరు శివారులోని గుండాల వద్ద నున్న వీరుల వాగు సమీపంలోని కాకతీయుల కాలం నాటి శిథిల వెంకటేశ్వరాలయాన్ని ప్లీచ్ ఇండియా పౌండేషన్ సీఈవో ఈమని శివనాగిరెడ్డి, మాచర్ల చరిత్రకారుడు పావులూరి సతీష్, స్థానిక యువకులతో కలిసి పరిశీలించారు. అనంతరం వాగులో నుండి తిరిగి వస్తుండగా అక్కడి శిలలపై శిలాయుగపు కాలంలో చిత్రించిన దుప్పి బొమ్మను కనుగొన్నారు. కొత్త రాతియుగంలో వాటిని చెక్కినట్లు గుర్తించారు. దీనికి కొంచెం దూరంలోనే రాతి పనిముట్లు తయారు చేసే అవాసాన్ని కూడా కనుగొన్నారు.
మరిన్ని ఆంధప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..