AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: పెదాలకు లిప్‌స్టిక్.. బొట్టు, పసందైన చీరకట్టు.. వల వేసే చూపులు అనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే

అరవ కామాక్షి.. చూడడానికి పద్ధతిగా కనిపించే ఈ మహిళ అసలు బాగోతం తెలిస్తే ఎంతటి వారికైనా చెమటలు పట్టాల్సిందే. ఈమె గురించి తెలిసిన వారైనా.. తెలియని వారైనా ఆమెతో పెట్టుకుంటే ఇక శాల్తీ గల్లంతే. అంతటి డేంజరస్ లేడీ వ్యవహారం తాజాగా నెల్లూరు లో వెలుగు చూసింది. ఈమె మరింత ప్రమాదకరమైన మహిళగా తాజా ఉదంతాలు చెబుతున్నాయి.

Andhra: పెదాలకు లిప్‌స్టిక్.. బొట్టు, పసందైన చీరకట్టు.. వల వేసే చూపులు అనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే
Andhra
Ch Murali
| Edited By: Ravi Kiran|

Updated on: Dec 01, 2025 | 1:08 PM

Share

మూడు రోజుల క్రితం ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన హంతకులను పట్టుకునేందుకు వెళ్ళిన పోలీసులకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. నెల్లూరు రూరల్ పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీలో కె. పెంచలయ్య(38), దుర్గా దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు బిడ్డలు. ఎలక్ట్రిషియన్ పనులు చేసుకుంటూ జీవనం సాగించే పెంచలయ్య. కొన్నేళ్ల కిందట బోడిగాడితోట నుంచి హౌసింగ్ బోర్డు కాలనీకి మారారు. సమాజ స్పృహతో పాటు వామపక్ష భావజాలం ఉండే ఈయన.. సీపీఎంలో నాయకుడిగా, ఆర్డీటీ కాలనీ ముత్యాలమ్మ గ్రామాభివృద్ది కమిటీ సభ్యుడిగా ఉన్నారు. కాలనీలో కొందరు యువకులు గంజాయి తాగడం.. విచ్చలవిడిగా విక్రయాలు జరగడం గమనించి.. అడ్డుకున్నారు. అరవ కామాక్షి ఆధ్వర్యంలో అమ్మకాలు జరుగుతున్నాయని తెలిసి.. పోలీసులకు సైతం సమాచారం అందించారు. దీంతో పెంచలయ్యపై కక్ష పెంచుకున్న గంజాయి బ్యాచ్.. ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్నారు. దీంతో శుక్రవారం సాయంత్రం పిల్లలతో స్కూటీపై ఇంటికి వెళుతుండగా.. హౌసింగ్ బోర్డు ఆర్చి వద్ద తొమ్మిది మంది గుర్తు తెలియని యువకులు పెంచలయ్యను అడ్డుకున్నారు.

మాకే అడ్డొస్తావా అంటూ ఒక్కసారిగా వారంతా కత్తులతో దాడికి పాల్పడ్డారు. బాధితుడు ప్రాణ భీతితో పారిపోతుండగా.. వెంటాడి పొడిచి మరీ పరారయ్యారు. తీవ్ర గాయాలైన పెంచలయ్యను స్థానికులు ఆసుపత్రికి తీసుకువెళ్లగా.. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్దారించారు.. పెంచలయ్య హత్యకు ప్రధాన సూత్రధారి కామాక్షి గా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. పెంచలేను హత్య చేసిన వారిలో కొంతమంది కోవూరు షుగర్ ఫ్యాక్టరీలో తల దాచుకున్నట్టు గుర్తించి అక్కడకు వెళ్లి అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ప్రయత్నంలో పోలీసులు పైనే దాడికి తెగబడడంతో పోలీసులు కాల్పులు జరిపారు.

ఈ కేసులో ఇప్పటివరకు 9 మందిని అదుపులోకి తీసుకోగా మరొక ఐదుగురిని ఇంకా అరెస్టు చేయాల్సి ఉంది. కామాక్షి ఇంట్లో శోధాలు చేసిన పోలీసులు భారీగా గంజాయి నిల్వ ఉన్నట్టు గుర్తించారు. కుమార్ 25 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని కామాక్షిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరు రూరల్, అర్బన్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ గామాక్షి కేసును విచారిస్తున్నారు. గంజాయి దందా కేసులకు కామాక్షిని అరెస్టు చేయగా వీటివారింటిపై నెల్లూరు రూరల్ పోలీసులు హత్య కేసులో కామాక్షిని అదుపులోకి తీసుకొని విచారించనున్నారు. కామాక్షి ఆర్థికంగా వెనకబడిన తన బంధువులు, నిరక్షరాశులయిన యువతను తన వ్యాపారం కోసం రంగంలోకి దించి వారి ద్వారా గంజాయిని అమ్మకాలు జరిపించేదని పోలీసుల విచారణలో తేలింది. విద్యార్థులే టార్గెట్‌గా గంజాయి వ్యాపారం కామాక్షి చేసే దానికి పోలీసులు గుర్తించారు. గంజాయి గంగా గురించి ఎవరైనా బయటపెట్టిన పోలీసులకు ఫిర్యాదు చేసిన వారిపై దాడులకు తెగబడేదని తెలుస్తోంది. పెంచలయ్య హత్య కేసుతో అటకేలకు కామాక్షి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఏంటో కామాక్షిని పోలీసులు విచారిస్తే మరిన్ని విషయాలు బయటపడేటువంటి అవకాశం ఉంది.