APSRTC: ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. బస్సుల్లో ఆ సమస్యలు తగ్గినట్లే.. అంతే కాకుండా
ప్రయాణీకులకు ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) గుడ్ న్యూస్ చెప్పింది. బస్సుల్లో చిల్లర సమస్యలను తగ్గించేందుకు స్వైపింగ్ మెషీన్లు, స్కానర్లను అందుబాటులోకి తీసుకురానుంది. డెబిట్‌కార్డు, ఫోన్ యూపీఐ ద్వారా పేమెంట్లు చేసుకునేందుకు డిజిటల్ ట్రాన్సాక్షన్స్....
ప్రయాణీకులకు ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) గుడ్ న్యూస్ చెప్పింది. బస్సుల్లో చిల్లర సమస్యలను తగ్గించేందుకు స్వైపింగ్ మెషీన్లు, స్కానర్లను అందుబాటులోకి తీసుకురానుంది. డెబిట్‌కార్డు, ఫోన్ యూపీఐ ద్వారా పేమెంట్లు చేసుకునేందుకు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేపట్టాలని నిర్ణయించింది. ప్రస్తుతం బస్సుల్లో టికెట్లు ఇచ్చేందుకు టిమ్స్ ను ఉపయోగిస్తున్నారు. వీటి స్థానంలో అధికారులు ఈ- పాస్ (E – Pass) యంత్రాలను తీసుకురానున్నారు. డెబిట్, క్రెడిట్ కార్డులు, ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం వంటి వాటి ద్వారా చెల్లించేలా వెసులుబాటు కల్పించనున్నారు. అంతేకాకుండా ఆర్టీసీ వ్యాలెట్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని నగదు నిల్వ ఉంచుకుంటే టికెట్‌ను సులభంగా పొందవచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు బస్సు కండక్టర్లకు అవగాహన కల్పిస్తున్నారు. మార్గమధ్యలో సర్వీసు ఆగిపోతే వేరే బస్సులోకి ప్రయాణికులను పంపించడానికి బ్రేక్‌డౌన్ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనిద్వారా సులభంగా వేరే బస్సులో గమ్యస్థానానికి వెళ్లవచ్చు.
ఆఫ్‌లైన్‌లో టికెట్ అందజేసే విధంగా ఈ -పాస్ యంత్రాన్ని రూపొందించారు. దీని ద్వారా సిగ్నల్ లేని ప్రాంతాల్లోనూ సులభంగా టికెట్ ఇచ్చేందుకు ఆవకాశం ఉంటుంది. బస్సు పాస్‌ను యంత్రంతో స్కాన్ చేసిన వెంటనే వివరాలు వస్తాయి. దీంతో ఎంతమంది పాస్ ద్వారా, టికెట్ ద్వారా ప్రయాణిస్తున్నారని సులువుగా తెలుసుకోవచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలోని కొన్ని ప్రధాన పట్టణాల్లో ప్రయోగత్మాకంగా టికెట్లను జారీచేస్తున్న అధికారులు.. త్వరలో అన్ని బస్సుల్లో యంత్రాలు అందుబాటలోకి తీసుకువస్తామని చెబుతున్నారు.
మరోవైపు.. ఏపీఎస్‌ఆర్టీసీ) బంపరాఫర్ ప్రకటించింది. తమ కొత్త బ్రాండ్‌కు మంచి పేరు చెప్పిన వారికి క్యాష్ ప్రైజ్ గెలుచుకునే అవకాశం కల్పించింది. పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకుండా.. చిన్న సలహా ఇవ్వండి.. క్యాష్ ప్రైజ్ సొంతం చేసుకోండి అని ఏపీఎస్‌ఆర్టీసీ ప్రకటన విడుదల చేసింది. కొత్తగా తీసుకొస్తున్న నాన్ ఏసీ స్లీపర్ కోచ్ బస్సు సర్వీసులకు మంచి పేరు చెప్పాలని రాష్ట్ర ప్రజలను కోరింది. ఈ అవకాశాన్ని వినియోగించి బ్రాండ్ ఇమేజ్ పెరిగేలా తమ సర్వీసులకు పేరును సూచించాలని విజ్ఞప్తి చేసింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..