సరుకు రవాణా వ్యవస్థలో ఏపీఎస్‌ఆర్టీసీ సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. కార్గోసేవలను గడప గడపకూ విస్తరిస్తోంది. ఉగాది నుంచి ప్రారంభమయ్యే డోర్ టు డోర్ కార్గో సేవలను రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ మరియు APSRTC మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావు ఆర్టీసీ హౌస్‌లో ఈ సర్వీసును ప్రారంభించారు. పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ లో ఆన్‌లైన్ సరుకు రవాణా సేవలను కూడా ప్రారంభించారు. అయితే ఈ సేవలు ఉగాది నుంచి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఎపిఎస్‌ఆర్‌టిసి ఇప్పుడు విజయవాడ-విశాఖపట్నం మధ్య ట్రయల్ రన్ నిర్వహిస్తోందని మంత్రి తెలిపారు.
లాభార్జన దృష్టితో కాకుండా ఓ వినూత్న కార్యక్రమంతో ప్రజల మనసుల్ని గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు మంత్రి విశ్వరూప్. ట్రైన్ టిక్కెట్టో… బస్ టిక్కెట్టో బుక్ చేసుకున్నంత సులభంగా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకొనే సదవకాశాన్ని అందుబాటులోకి తేనుంది ఏపీఎస్‌ఆర్టీసీ. ఏపీఎస్‌ఆర్టీసీ ఇప్పటివరకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో సరుకు రవాణా సేవల ద్వారా ₹163 కోట్లను ఆర్జించింది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఆదాయం ₹168 కోట్లకు చేరవచ్చు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి, సరుకు రవాణాపై ₹500 కోట్లు లక్ష్యంగా పెట్టుకోవాలని రవాణా మంత్రి తెలిపారు.
సమయం వృధా అవకుండా వినియోగదారులకు మేలు జరుగుతుందన్నారు rtc md తిరుమలరావు. గత ఆరేళ్ళుగా కార్గో సేవలను పెంచలేదన్నారు ఆర్టీసీ ఎండీ. ఏపీఎస్ ఆర్టీసీ వెబ్‌సైట్ల ద్వారా షిప్ మంత్ర డాట్.కామ్‌లో ఈ సేవలను ఉపయోగించుకోవచ్చన్నారు. బస్ స్టేషన్ నుంచి బస్ స్టేషన్ వరకు మాత్రమే సరుకు రవాణా చేసే విధానంలో తీసుకొచ్చిన ఈ సరికొత్త మార్పు ప్రజలకు ఎంతో ఉపయోగమన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..