ప్రమాదం చెప్పి రాదు.. ఏ క్షణం ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరు. కానీ, ప్రమాదానికి గురైనప్పటికీ అదృష్టం కొద్ది వెంట్రుకవాసిలో తప్పించుకున్నంటే.. వారి ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుసా? తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే. అవును, ఈ వీడియో చూస్తే మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. తాజాగా ఏపీలో జరిగిన ఓ భయంకరమైన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. ఆ వీడియో చూసి జనాలు హడలిపోతున్నారు. బాప్ రే అంటూ గుండెల మీద చేయి వేసుకుని గట్టిగా ఊపిరి పీల్చుకుంటున్నారు.
కైకలూరు మండలం పల్లెవాడ వద్ద రోడ్డుపై ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు వెళ్తుండగా.. ఒక్కసారిగా ద్విచక్రవాహనదారుడు రోడ్డుపైకి దూసుకొచ్చాడు. దాంతో అలర్ట్ అయిన బస్సు డ్రైవర్ ఆ బైక్‌ను తప్పించబోయాడు. దాంతో బస్సు ఆ అదుపు తప్పింది. అలా అదుపు తప్పిన బస్సు రోడ్డు పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. అదృష్టం కొద్ది.. బస్సు బోల్తా కొట్టే సమయంలో చెరువు గట్టును ఢీకొని బస్సు ఆగిపోయింది. బస్సు ప్రమాదానికి గురైన సమయంలో 50 మంది ప్రయాణికులు అందులో ఉన్నారు.
బస్సుకు ఎలాంటి ప్రమాదం జరుగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. చెరువు గట్టున నిలిచిపోయిన బస్సు నుంచి ప్రయాణికులు ప్రాణభయంతో త్వరత్వరగా దిగిపోయారు. అయితే, ఈ ప్రమాదం.. సమీపంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. రెండు రోజుల క్రితం ఈ ప్రమాదం జరుగగా.. ఇప్పుడు అందుకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో చూసి జనాలు షాక్ అవుతున్నారు. ఏమాత్రం తేడా జరిగినా.. ఎంత మంది ప్రాణాలు గాల్లో కలిసేవోనని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..