Andhra Pradesh: వర్షాకాలం వచ్చిందంటే చాలు.. ప్రజల జీవనం అస్తవ్యస్తం అవుతుంది. పెద్ద పెద్ద నగరాలూ సైతం నీటమునుగుతాయి. వీధులన్నీ నదులను తలపిస్తాయి. ఇక రక పోకల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు వర్షాకాలం మొదలైంది విస్తారంగా వర్షాలు కురవడం మొదలైంది. తెలుగురాష్ట్రాల్లోనూ పలు ప్రాంతాల్లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. ఈ క్రమంలో తూర్పు గోదావరి జిల్లా గోకవరం వద్ద టార్పాలిన్ కవర్‌తో వెళ్లిన ఓ బస్సుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం అంటుంటారు. కానీ వర్షాకాలంలో మాత్రం కాస్త ఇబ్బంది తప్పదు. బసులోకి వర్షపు నీరు రావడం జరుగుతూ ఉంటుంది. తాజాగా వైరల్ అవుతోన్న వీడియోలో విస్తారంగా కురుస్తున్న వర్షాలు నేపథ్యంలో బస్సు లోపలికి వర్షపు జల్లు రాకుండా పైకప్పును కవర్‌తో కప్పి జాగ్రత్తలు తీసుకున్నారు రాజమండ్రి ఆర్టీసి అధికారులు. బస్సుకు పైభాగం నుంచి కిటికీల వరకు మొత్తం టార్పాలిన్ కవర్‌తో కప్పి ఉన్న ఆర్టీసీ బస్సును చూసి షాక్ అవుతున్నారు ప్రయాణికులు. అయితే ప్రభుత్వ పాఠశాలలకు పుస్తకాల పంపిణీ చేసే క్రమంలో వర్షపు నీళ్ళు లోపలికి రాకుండా ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లు క్లారిటీ ఇచ్చారు ఆర్టీసి అధికారులు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి :