YS Sharmila: ఏపీలో దూకుడు పెంచిన వైఎస్ షర్మిల.. వైసీపీ, టీడీపీపై మాటల తూటాలు..

|

Jan 27, 2024 | 1:45 PM

తెలంగాణలో వైఎస్ఆర్టీపీ స్థాపించి కాంగ్రెస్‎లో విలీనం చేసి ఏపీ పీసీసీగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల రాజకీయంగా దూకుడు ప్రదర్శిస్తున్నారు. పదునైన మాటలు, నికాసైన కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా పర్యటనలు మొదలు పెట్టేశారు. ఈ తరుణంలో వైసీపీ నేతలు షర్మిల గతంలో చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు.

YS Sharmila: ఏపీలో దూకుడు పెంచిన వైఎస్ షర్మిల.. వైసీపీ, టీడీపీపై మాటల తూటాలు..
Ys Sharmila
Follow us on

తెలంగాణలో వైఎస్ఆర్టీపీ స్థాపించి కాంగ్రెస్‎లో విలీనం చేసి ఏపీ పీసీసీగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల రాజకీయంగా దూకుడు ప్రదర్శిస్తున్నారు. పదునైన మాటలు, నికాసైన కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా పర్యటనలు మొదలు పెట్టేశారు. ఈ తరుణంలో వైసీపీ నేతలు షర్మిల గతంలో చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ సందర్భంగా వారి మాటలకు తనదైన తూటాలను ఎక్కుపెడుతున్నారు షర్మిల. తాజాగా వైసీపీ నేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై ముప్పేట దాడి చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీని భుజాన వేసుకుని పనిచేశానన్నారు. నారక్తం, చెమట ధారపోశానని గతాన్ని గుర్తుచేశారు. ఇక్కడ ఎవరూ భయపడరు యుద్దానికి మేము రెడీ.. మీరు రెడీనా అంటూ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఏపీలో ప్రత్యేక హోదా రావాలి.. పోలవరం పూర్తికావాలన్నారు. రైతులకు రుణమాఫీ చేయాలి. అందుకే రాజన్న బిడ్డగా ముందుకు వచ్చానని చెప్పుకొచ్చారు.

గుండ్లకమ్మ ప్రాజెక్టుకు మెయింటెన్స్‌ చేసే దిక్కు కూడా లేకుండా పోయిందని విమర్శించారు. టీడీపీ, వైసీపీ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయాయని ఆరోపించారు. వైయస్‌ఆర్‌ ఆశయాలను నెరవేరుస్తున్నామని చెబుతున్న వారు ప్రాజెక్టును ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో వైయస్‌ఆర్‌ లేరన్నారు. ఇది జగన్‌ పార్టీ ప్రజలను పట్టించుకోని పార్టీ అంటూ సంచలన కామెంట్స్ చేశారు. వై అంటే వైవి సుబ్బారెడ్డి, ఎస్‌ అంటే సాయిరెడ్డి, ఆర్‌ అంటే రామకృష్ణారెడ్డి అని ఎద్దేవా చేశారు. జిల్లాలో నిమ్జ్ ఏర్పాటు చేయాలని వైఎస్ఆర్ సంకల్పించారన్నారు. తద్వారా 3 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలనుకున్నారు. జగన్‌ సీఎం కాకముందు నిమ్జ్‌ను పూర్తి చేస్తామని చెప్పి ఒక్క ఇండస్ట్రీని కూడా తీసుకురాలేదన్నారు. ఏ ఒక్కరికీ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయారన్నారు. జిల్లాకో ఎయిర్ పోర్టు అని చెప్పారు. బోయింగ్‌లు తిప్పుతామన్నారు చెప్పిందంతా గాలికి పోయిందన్నారు వైఎస్ షర్మిల.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..