జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్ల వ్యాఖ్యలపై ఏపీ మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని అలాగే మహిళలకు క్షమాపణ చెప్పాలని మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. ‘జనసేన అధినేత పవన్ చేసిన వ్యాఖ్యలు బాధించాయి. భరణం ఇస్తే భార్యను వదిలించుకోవచ్చని ఆయన చేసిన వ్యాఖ్యలు సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అలాగే భరణం ఇచ్చి మీరూ మూడు పెళ్లిళ్లు చేసుకోవాలన్న వ్యాఖ్యలను పవన్ ఉపసంహరించుకోవాలి. భార్యను వదిలించుకుంటూ పోతే మహిళలకు భద్రత ఉంటుందా? మహిళలను ఉద్దేశించి స్టెప్నీ అనే పదం ఉపయోగించం ఆక్షేపణీయం. ఎవరి జీవితంలో అయినా 3 పెళ్లిళ్లు చేసుకోవాల్సి వస్తే కచ్చితంగా వ్యతిరేక అంశమే. కోట్ల రూపాయల భరణం, విడాకులు ఇచ్చి మీరు చేసుకోండి అనడం సాధారణ విషయం కాదు. ఒక సినిమా హీరోగా , ఒక పార్టీ అధ్యక్షుడిగా మూడు పెళ్లిళ్లపై మీ మాటలు సమాజంపై ప్రభావం చాలా ప్రభావం చూపుతాయి. మీ వ్యాఖ్యలు మహిళల భద్రతకు పెను ప్రమాదంగా మారే అవకాశం ఉంది. పవన్ కల్యాణ్ వివరణ కోసం ఏపీ మహిళా కమిషన్ ఎదురుచూస్తుంది’ అని వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు.
తన మూడు పెళ్లిళ్ల విషయంపై వైస్సార్సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చే పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో జరిగిన ఓ ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ భరణం ఇచ్చి మీరూ మూడు పెళ్లిళ్లు చేసుకోండంటూ వైసీపీ నాయకులపై విరుచుకుపడ్డారు. దీనిపై ఏపీ సీఎం జగన్‌తో పాటు వైసీపీ నాయకులు కూడా గట్టిగా బదులిచ్చారు. పవన్ వ్యాఖ్యలు మహిళల భద్రతకు ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. తాజాగా మహిళా కమిషన్ కూడా జనసేనాని వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నోటీసులు కూడా జారీ చేసింది. మరి ఈ నోటీసులపై పవన్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
కాగా ఈ విషయంపై టీవీ9 తో మాట్లాడిన వాసిరెడ్డి పద్మ నోటీసులపై పవన్ వివరణ ఇవ్వకపోతే చూస్తూ ఊరుకోమన్నారు. ‘ పవన్ కళ్యాణ్ క్షమించరాని తప్పు చేశారు. దీన్ని కూడా జనసేన ,టీడీపీ నేతలు సమర్దిస్తున్నారు. మహిళ జీవితాన్నీ భరణంతో వెళకట్టగలరా? 3 పెళ్లిళ్లు చేసుకున్న..30 మందితో ఉన్నా వ్యక్తిగత చౌకబారుతనం. పెళ్లి అనేది..భార్యాభర్తల బంధం. పవన్ బాద్యతలేకుండా మాట్లాడడపై వివరణ ఇవ్వాలి. మహిళలకు క్షమాపణ చెప్పి , పవన్ వాఖ్యలను ఉపసంహరించుకోవాలి. రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులకు పవన్ సమాధానం చెప్పాలి. వివరణ ఇవ్వకపోతే చూస్తూ ఊరుకోం’ అని తెలిపారు వాసిరెడ్డి పద్మ.
ఇంతకీ తన మూడు పెళ్లిళ్ల పై పవన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
Dara Chaitanya Pspk
Janasenaparty
Pawan Kalyan Pawan
Chaitanyadarapspk
Miru chesukodi marriages 3 ysrcp lenders pic.twitter.com/h11TrSHlst— darachaitanya (@chaitanyadara31) October 18, 2022
YS Jagan Strong Reply to @PawanKalyan on 3 Marriages comments ??? pic.twitter.com/iUvpRYXug3
— YS Jagan Trends™ (@YSJaganTrends) October 20, 2022
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..