AP Weather Alert: నైరుతి రుతుపవనాల ప్రభావం… ఏపీలో మూడు రోజుల పాటు.. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం..

|

Jun 20, 2022 | 2:51 PM

నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ సహా అనేక ప్రాంతాల్లో రెండు రోజుల్లో విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో రానున్న మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో వివిధ ప్రాంతంలో వాతావరణం ఏ విధంగా ఉండనున్నదో ప్రకటించింది.

AP Weather Alert: నైరుతి రుతుపవనాల ప్రభావం... ఏపీలో మూడు రోజుల పాటు.. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం..
Weather Alert
Follow us on

AP Weather Alert: నైరుతి రుతుపవనాలు(Monsoon) మధ్యప్రదేశ్‌లోని చాలా ప్రాంతాలు, ఛత్తీస్‌గఢ్‌లోని మిగిలిన ప్రాంతాలు, కోస్తా ఆంధ్ర ప్రదేశ్, వాయువ్య బంగాళాఖాతంలోని మిగిలిన భాగాలు, మొత్తం ఒడిశా, గంగా పశ్చిమ బెంగాల్, చాలా వరకు జార్ఖండ్ , బీహార్‌లోని కొన్ని భాగాలు, ఆగ్నేయ ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో రెండు రోజుల్లో న విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. నైరుతి రుతుపవనాలు పోర్‌బందర్, బరోడా, శివపురి, రేవా, చుర్క్ మీదుగా కొనసాగుతుంది. నిన్న విదర్భ నుండి దక్షిణ తమిళనాడు వరకు ఉన్న ఉపరితల ద్రోణి ఈరోజు దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుండి దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి సగటున 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతోంది.. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో రానున్న మూడు రోజుల పాటు వాతావరణం ఏ విధంగా ఉండనున్నదో.. వాతావరణ శాఖ సూచించింది.

ఉత్తర కోస్తా, యానాం: ఈ రోజు, రేపు, ఎల్లుండి(జూన్ 22వ తేదీ) వరకూ తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు.. మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా: ఈ రోజు, రేపు , ఎల్లుండి(జూన్ 22వ తేదీ) వరకూ తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. ఒకటి లేదా రెండు చోట్ల కురిసే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఎల్లుండి తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.

ఇవి కూడా చదవండి

రాయలసీమ: ఈ రోజు, రేపు , ఎల్లుండి(జూన్ 22వ తేదీ) వరకూ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. ఈ రోజు భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఎల్లుండి తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.

మరిన్ని వాతావారణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..