AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Weather Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం..

నైరుతి బంగాళాఖాతం మీద సగటు సముద్ర మట్టం నుండి 3.1 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఎత్తుకు వెళ్లే కొలది దక్షిణం వైపుకు వంగి ఉన్నదని పేర్కొంది. దీంతో ఆంధ్రప్రదేశ్ లో రానున్న మూడు రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని..

AP Weather Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం..
AP Weather Alert
Surya Kala
|

Updated on: Oct 14, 2022 | 1:34 PM

Share

గురువారం మధ్యాహ్నం బంగాళాఖాతం..  పొరుగు ప్రాంతాల మీద ఉన్న ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారి ఇప్పుడు పశ్చిమ మధ్య..  ప్రక్కనే ఉన్న నైరుతి బంగాళాఖాతం మీద సగటు సముద్ర మట్టం నుండి 3.1 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది  ఎత్తు కు వెళ్లే కొలది దక్షిణం వైపుకు వంగి ఉన్నదని పేర్కొంది. దీంతో ఆంధ్రప్రదేశ్ లో రానున్న మూడు రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని.. మూడు రోజులకు వాతావరణ సూచనలు చేసింది.

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం: ఈరోజు, రేపు, ఎల్లుండి (అక్టోబర్ 16వ తేదీ) తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్: ఈరోజు, రేపు, ఎల్లుండి (అక్టోబర్ 16వ తేదీ) తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.

ఇవి కూడా చదవండి

రాయలసీమ: ఈరోజు, రేపు, ఎల్లుండి (అక్టోబర్ 16వ తేదీ) వరకూ మూడు రోజుల పాటు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.మరికొన్ని చోట్ల తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
యువతలో గుండెపోటు మరణాలు పెరగడానికి అసలు కారణం ఇదే
యువతలో గుండెపోటు మరణాలు పెరగడానికి అసలు కారణం ఇదే
ధోనీ అభిమానులకు గుడ్‌న్యూస్.. రీఎంట్రీ డేట్ ఫిక్స్
ధోనీ అభిమానులకు గుడ్‌న్యూస్.. రీఎంట్రీ డేట్ ఫిక్స్
నకిలీ టూత్‌పేస్ట్‌ను చిటికెలో కనిపెట్టే 'స్మార్ట్' టిప్స్ ఇవే!
నకిలీ టూత్‌పేస్ట్‌ను చిటికెలో కనిపెట్టే 'స్మార్ట్' టిప్స్ ఇవే!
ముల్లును ముల్లుతో తీసేందుకు పుట్టిన పాకిస్థాన్‌ బ్రెయిన్ వైరస్..!
ముల్లును ముల్లుతో తీసేందుకు పుట్టిన పాకిస్థాన్‌ బ్రెయిన్ వైరస్..!
ఆర్టీసీలో ఉద్యోగాల రాత పరీక్ష 2026 ఫలితాలు విడుదల.. లింక్ ఇదే
ఆర్టీసీలో ఉద్యోగాల రాత పరీక్ష 2026 ఫలితాలు విడుదల.. లింక్ ఇదే
ఫ్లైట్‌లో నల్ల సాక్సులు ఎందుకు వద్దంటారో తెలుసా?
ఫ్లైట్‌లో నల్ల సాక్సులు ఎందుకు వద్దంటారో తెలుసా?
రాత్రిళ్లు పదే పదే మూత్రవిసర్జన అవుతోందా? లైట్ తీసుకోకండి
రాత్రిళ్లు పదే పదే మూత్రవిసర్జన అవుతోందా? లైట్ తీసుకోకండి
వాట్సాప్‌లో ఈ 5 రహస్య ఫీచర్లు మీకు తెలుసా? 90% మందికి తెలియని ఈ ట
వాట్సాప్‌లో ఈ 5 రహస్య ఫీచర్లు మీకు తెలుసా? 90% మందికి తెలియని ఈ ట
నా ప్రతి సినిమాతో వారు హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను: నిహారిక
నా ప్రతి సినిమాతో వారు హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను: నిహారిక
శ్రీవారి భక్తులకు హెచ్చరిక! వీఐపీ దర్శనం పేరుతో మోసపోకండి
శ్రీవారి భక్తులకు హెచ్చరిక! వీఐపీ దర్శనం పేరుతో మోసపోకండి