AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diwali: దీపావళి వేడుకలకు ముస్తాబవుతున్న అయోధ్య.. సరయు తీరంలో దీపోత్సవానికి సన్నాహాలు ..

అయోధ్యలో ఈ ఏడాది కూడా లక్షలాది దీపాలను సరయు తీరంలో వెలిగించనున్నారు. 12 లక్షలకు పైగా దీపాలు వెలిగించి గిన్నిస్ రికార్డును సొంతం చేసుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Diwali: దీపావళి వేడుకలకు ముస్తాబవుతున్న అయోధ్య.. సరయు తీరంలో దీపోత్సవానికి సన్నాహాలు ..
Ayodhya Diwali 2022
Surya Kala
|

Updated on: Oct 14, 2022 | 8:17 AM

Share

దేశ వ్యాప్తంగా దీపావళి వేడుకల సందడి మొదలైంది. రామ జన్మ భూమి అయోధ్య దీపావళికి ముందు దీపోత్సవాన్ని ఘనంగా జరుపుకోనుంది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్ 23న అయోధ్యలోని రామ్‌కీ పైడి ఘాట్‌లలో ఆరవ దీపోత్సవ్ (దీపాల పండుగ) జరుపుకోవడానికి సన్నాహాలు ముమ్మరం చేసింది. ఈ ఏడాది కూడా లక్షలాది దీపాలను సరయు తీరంలో వెలిగించనున్నారు.

12 లక్షలకు పైగా దీపాలు వెలిగించి గిన్నిస్ రికార్డును సొంతం చేసుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2020లో 5.84 లక్షల దీపాలు వెలిగించి కొత్త రికార్డు సృష్టించారు. గతేడాది దీపోత్సవంలో 9 లక్షల మట్టి దీపాలు వెలిగించారు. ఈ ఏడాది దీపోత్సవం కోసం అయోధ్య, లక్నో, గోండా తదితర జిల్లాల నుంచి మట్టి కుండలను తెప్పిస్తున్నామని, రామ్‌ పడిలో దీపాల సేకరణ ప్రక్రియ కూడా ప్రారంభమైందని జిల్లా యంత్రాంగం చెప్పింది.

ఇవి కూడా చదవండి

ఈ దీపోత్సవంలో దీపాలు.. 30 నిమిషాలకు పైగా వెలుగుతాయని పేర్కొంది. ఇది గత ఐదేళ్లలో దీపాలు వెలిగిన సమయం కంటే చాలా అధికం. దీపోత్సవాన్ని చూసేందుకు భారీగా ప్రజలు తరలి వస్తారు. అంతేకాదు ఈ దీపోత్సవంలో దీపాలు వెలిగించే ప్రమిదల్లో 30 మిల్లీ లీటర్లకు బదులుగా 40 మిల్లీలీటర్ల నూనెను పోయనున్నారు. తద్వారా ఎక్కువ సేపు దీపాలు వెలగనున్నాయి. దీంతో దీపాలు అధిక సమయం కాంతులు వెదజల్ల నున్నాయి. ఈ దీపోత్సవంలో రాముడు, సీతాదేవి వారి ‘పుష్పక్ విమానం’లో అయోధ్యకు రానున్నారు. లేజర్, సౌండ్ షో, సాంస్కృతిక కార్యక్రమాలను కూడా అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు.

గత సంవత్సరం 2021లో ఉత్తరప్రదేశ్ పర్యాటక శాఖ, డాక్టర్ రామ్ మనోహర్ లోహియా అవధ్ విశ్వవిద్యాలయం సంయుక్తంగా అయోధ్యలో ఘనంగా దీపోత్సవాన్ని ఏర్పాటు చేశారు. రామ్ కి పైడి ఘాట్‌లలో దీపోత్సవ ప్రదర్శన” కోసం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..