ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు ఠారెత్తిస్తున్నాయి. వివిధ జిల్లాల్లో శనివారం గరిష్ఠంగా 46 డిగ్రీలకు చేరువగా నమోదైనట్లు అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. గత కొన్ని రోజులుగా ఉదయం 9 గంటలకే ఎంత తీవ్రత మొదలవుతుంది. ఓ వైపు వేడి గాలులు, మరోవైపు ఉక్కపోత కారణంగా ప్రజలు నానా ఇక్కట్లు పడుతున్నారు. బయట అడుగుపెట్టాలంటే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. మరో రెండు రోజుల పాటు ఇది రీతిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఆదివారం 135 మండలాల్లో, సోమవారం 276 మండలాల్లో వడగాడ్పులు, తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉందని తెల్పింది. శనివారం 14 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 143 మండలాల్లో వడగాడ్పులు వీచినట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది.
ఓ వైపు ఎండలు మండిపోతుండగా.. రాబోయే ఐదు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేసింది. అలాగే రాబోయే రెండు రోజుల పాటు పలు మండలాల్లో తీవ్ర వడగాల్పులతో కూడిన అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని తెల్పింది.
శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయి.
నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, ఏలూరు, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం జిల్లాల్లో వానలు కరవనున్నట్లు వాతావరణశాఖ తెల్పింది
కాకినాడ, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేసింది.
అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ జిల్లాలకు వర్ష సూచన
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చెదురు మొదురు వర్షాలు పడే అవకాశం ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.