AP Rains: ఏపీలో వర్షాలు కురిసే ప్రాంతాలివే.. ఆ జిల్లాలకు భారీ రెయిన్ అలెర్ట్

ఏపీకి చల్లటి వార్త వచ్చేసింది. వాతావరణ శాఖ అధికారులు వచ్చే 3 రోజులకు కీలక సూచనలు ఇచ్చారు. ఈ మూడు రోజులు రాష్ట్రంలో ఏయే ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయో ఇప్పుడు ఈ స్టోరీ మీరు చూడవచ్చు. మరి లేట్ ఎందుకు చూసేద్దాం పదండి.

AP Rains: ఏపీలో వర్షాలు కురిసే ప్రాంతాలివే.. ఆ జిల్లాలకు భారీ రెయిన్ అలెర్ట్
Ap Rains

Updated on: Dec 27, 2024 | 5:06 PM

నైరుతి దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో అనగా దక్షిణ ఆంధ్రప్రదేశ్-ఉత్తర తమిళనాడు తీర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉన్న ఎగువ వాయు ఉపరితల ఆవర్తనం ఇపుడు బలహీనపడినది. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఇలా..

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:-
—————————————-

ఈరోజు:-

తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

ఇవి కూడా చదవండి

రేపు, ఎల్లుండి:-

పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:-
——————————

ఈరోజు, రేపు, ఎల్లుండి:-

తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

రాయలసీమ:-
————–

ఈరోజు, రేపు, ఎల్లుండి:-

తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

ఇది చదవండి: ట్రైన్ ఏసీ భోగీలో చెక్ చేస్తూ.. ఓ బెర్త్‌ కింద కనిపించింది చూడగా

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..