AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rains: ఏపీకి భారీ రెయిన్ అలర్ట్.. 16 జిల్లాలకు ఎల్లో హెచ్చరిక.. వాతావరణశాఖ అప్డేట్ ఇదే..

దక్షిణ చత్తీస్గఢ్ పరిసర ప్రాంతాలపై కేంద్రీకృతమైన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్రతో పాటు కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వానలు పడుతున్నాయి. తీర ప్రాంతంలో బలమైన గాలులు వీస్తుండటంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణశాఖ హెచ్చరించింది.

Rains: ఏపీకి భారీ రెయిన్ అలర్ట్.. 16 జిల్లాలకు ఎల్లో హెచ్చరిక.. వాతావరణశాఖ అప్డేట్ ఇదే..
Rains
Venkatrao Lella
|

Updated on: Sep 13, 2026 | 9:37 AM

Share

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన చేసింది. విదర్భ, మధ్యప్రదేశ్ ప్రాంతాలపై అల్పపీడనం కేంద్రీకృతమైన స్పష్టం చేసింది. దీని ప్రభావంతో రాబోయే 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఆదివారం అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయని అంచనా వేసింది. ఉత్తరాంధ్ర తీరం వెంబడి 40-60 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని,  రాగల మూడు గంటలు కాకినాడ, విశాఖ ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది. పిడుగులు, ఈదురుగాలుల వేళ చెట్లు, హోర్డింగ్స్ కింద నిలబడవద్దని ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. పొంగిపొర్లే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయవద్దని సూచనలు చేసింది. భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న క్రమంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తుండగా.. రాబోయే కొన్ని రోజుల పాటు వానలు కొనసాగే అవకాశముందని స్పష్టం చేసింది. దీంతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించింది.

ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం జిల్లాకు మోస్తరు నుంచి భారీ వర్ష సూచన ఉండగా.. విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. మరోవైపు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. దక్షిణ కోస్తాలో ఉన్న కృష్ణ, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది.

ఉత్తరాంధ్ర తీరంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్లు, దక్షిణ కోస్తా తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కొన్ని సందర్భాల్లో గాలుల తీవ్రత 70 కిలోమీటర్లకు కూడా పెరిగే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. తీర ప్రాంత ప్రజలతో పాటు మత్స్యకారులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, ఈరోజు, రేపు కూడా చేపల వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. 16 జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో వార్నింగ్ జారీ చేసింది. వాతావరణ శాఖ ఇప్పటికే కోస్తా తీరం వెంబడి ఉన్న ఈ 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టగా.. తాజాగా ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో వానలు మళ్లీ మొదలయ్యాయి.

Follow Us
ఏపీకి భారీ వర్షసూచన.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్..
ఏపీకి భారీ వర్షసూచన.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్..
కాణిపాకం వరసిద్ధి వినాయకుడి బ్రహ్మోత్సవాలు.. చవితి నుంచి వైభవం..
కాణిపాకం వరసిద్ధి వినాయకుడి బ్రహ్మోత్సవాలు.. చవితి నుంచి వైభవం..
ఫైనల్ పోరులో క్రికెటర్ల రచ్చ.. మైదానంలోనే పొట్టుపొట్టుగా..!
ఫైనల్ పోరులో క్రికెటర్ల రచ్చ.. మైదానంలోనే పొట్టుపొట్టుగా..!
కోరికలు తీర్చే వరాహ జయంతి.. భూమిని రక్షించిన విష్ణువు అవతారం ఇదే.
కోరికలు తీర్చే వరాహ జయంతి.. భూమిని రక్షించిన విష్ణువు అవతారం ఇదే.
జనరల్ కోచ్‌లు ట్రైన్ ముందు, వెనుక భాగంలోనే ఎందుకుంటాయి..?
జనరల్ కోచ్‌లు ట్రైన్ ముందు, వెనుక భాగంలోనే ఎందుకుంటాయి..?
పులిపిర్లు వదిలించుకోవడానికి అద్భుత పరిష్కారం
పులిపిర్లు వదిలించుకోవడానికి అద్భుత పరిష్కారం
అబ్బురపరుస్తున్న అనకాపల్లి కళాకారుడి సూక్ష్మ కళాఖండం!
అబ్బురపరుస్తున్న అనకాపల్లి కళాకారుడి సూక్ష్మ కళాఖండం!
పోలీస్ శాఖలో 275 SI ఉద్యోగాలు.. మరో 2 రోజుల్లో ముగుస్తున్న గడువు
పోలీస్ శాఖలో 275 SI ఉద్యోగాలు.. మరో 2 రోజుల్లో ముగుస్తున్న గడువు
కృష్ణుడి గెటప్‌లో విమానంలో ప్రయాణించిన నటుడు..
కృష్ణుడి గెటప్‌లో విమానంలో ప్రయాణించిన నటుడు..
బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన తిరుమల.. దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం
బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన తిరుమల.. దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం