AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ఫైనల్ పోరులో క్రికెటర్ల రచ్చ.. అంపైర్లు అడ్డుగా వచ్చినా మైదానంలోనే పొట్టుపొట్టుగా.. !

Nepal vs UAE Clash: ఏసీసీ మెన్స్ ప్రీమియర్ కప్ 2026 (ACC Men's Premier Cup 2026) తుది పోరులో తీవ్ర నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. మలేషియాలోని బాయుమాస్ ఓవల్ (Bayumas Oval) మైదానంలో నేపాల్ క్రికెట్ జట్టు (Nepal Cricket Team), యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) ఆటగాళ్ల మధ్య మైదానంలోనే తీవ్ర వాగ్వాదం చెలరేగింది. ఒకరినొకరు నెట్టుకునే స్థాయికి చేరిన ఈ వివాదం కలకలం రేపింది.

Video: ఫైనల్ పోరులో క్రికెటర్ల రచ్చ.. అంపైర్లు అడ్డుగా వచ్చినా మైదానంలోనే పొట్టుపొట్టుగా.. !
Acc Premier Cup Final Nepal Vs Uae Players Fight
Venkata Chari
|

Updated on: Sep 13, 2026 | 9:00 AM

Share

Nepal vs UAE Clash: మలేషియా వేదికగా ముగిసిన ఏసీసీ ప్రీమియర్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో నేపాల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆటగాళ్లు మైదానంలోనే పరస్పరం వాగ్వాదానికి దిగారు. 314 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో యూఏఈ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఈ గొడవ జరిగింది. ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం ముదిరి తోపులాటకు దారితీసింది. ఆరో ఓవర్ ప్రారంభించేందుకు లెగ్ స్పిన్నర్ సందీప్ లమిచానే (Sandeep Lamichhane) సిద్ధమవుతున్న వేళ, వికెట్ కీపర్ ఆసిఫ్ షేక్ (Aasif Sheikh) బ్యాటర్ తనీష్ సూరి (Tanish Suri) కి ఏదో చెప్పడంతో వివాదం రాజుకుంది. దీంతో సహనం కోల్పోయిన సూరి ఘాటుగా స్పందించాడు. ఫీల్డర్లు కూడా అక్కడికి చేరుకోవడంతో వాతావరణం మరింత వేడెక్కింది.

ఈ తీవ్ర ఉద్రిక్తతను గమనించిన ఆన్-ఫీల్డ్ అంపైర్లు విశ్వనాథన్ కాళిదాస్ (Viswanadan Kalidas), తబారక్ దార్ (Tabarak Dar) వెంటనే రంగంలోకి దిగారు. ఆటగాళ్లను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఆ తరువాత నేపాల్ కెప్టెన్ లమిచానే బ్యాటర్‌ను కౌగిలించుకుని వివాదానికి ముగింపు పలకడంతో మ్యాచ్ యథావిధిగా కొనసాగింది.

ఇవి కూడా చదవండి

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ నిర్ణీత 50 ఓవర్లలో 313 పరుగులు చేసింది. ఓపెనర్ ఆసిఫ్ షేక్ 106 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 102 పరుగులు సాధించి అద్భుత శతకంతో మెరిశాడు. ఐదో స్థానంలో వచ్చిన గుల్షన్ ఝా (Gulsan Jha) 38 బంతుల్లో 52 పరుగులు బాదాడు. యూఏఈ బౌలర్ ఇబ్రార్ అహ్మద్ (Ibrar Ahmed) కీలక వికెట్లు తీసి ప్రత్యర్థి స్కోరును కట్టడి చేసే ప్రయత్నం చేశాడు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ 49.1 ఓవర్లలో 269 పరుగులకే ఆలౌట్ కావడంతో నేపాల్ ఘన విజయం సాధించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఫైనల్ పోరులో క్రికెటర్ల రచ్చ.. మైదానంలోనే పొట్టుపొట్టుగా..!
ఫైనల్ పోరులో క్రికెటర్ల రచ్చ.. మైదానంలోనే పొట్టుపొట్టుగా..!
కోరికలు తీర్చే వరాహ జయంతి.. భూమిని రక్షించిన విష్ణువు అవతారం ఇదే.
కోరికలు తీర్చే వరాహ జయంతి.. భూమిని రక్షించిన విష్ణువు అవతారం ఇదే.
జనరల్ కోచ్‌లు ట్రైన్ ముందు, వెనుక భాగంలోనే ఎందుకుంటాయి..?
జనరల్ కోచ్‌లు ట్రైన్ ముందు, వెనుక భాగంలోనే ఎందుకుంటాయి..?
పులిపిర్లు వదిలించుకోవడానికి అద్భుత పరిష్కారం
పులిపిర్లు వదిలించుకోవడానికి అద్భుత పరిష్కారం
అబ్బురపరుస్తున్న అనకాపల్లి కళాకారుడి సూక్ష్మ కళాఖండం!
అబ్బురపరుస్తున్న అనకాపల్లి కళాకారుడి సూక్ష్మ కళాఖండం!
పోలీస్ శాఖలో 275 SI ఉద్యోగాలు.. మరో 2 రోజుల్లో ముగుస్తున్న గడువు
పోలీస్ శాఖలో 275 SI ఉద్యోగాలు.. మరో 2 రోజుల్లో ముగుస్తున్న గడువు
కృష్ణుడి గెటప్‌లో విమానంలో ప్రయాణించిన నటుడు..
కృష్ణుడి గెటప్‌లో విమానంలో ప్రయాణించిన నటుడు..
బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన తిరుమల.. దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం.
బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన తిరుమల.. దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం.
కాణిపాకం వినాయకుడి బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు..
కాణిపాకం వినాయకుడి బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు..
భక్తులకు గుడ్‌న్యూస్.. హైదరాబాద్‌లోని ఈ రూట్‌లో ప్రత్యేక బస్సులు!
భక్తులకు గుడ్‌న్యూస్.. హైదరాబాద్‌లోని ఈ రూట్‌లో ప్రత్యేక బస్సులు!