AP Weather Alert: ఏపీ వాసులకు అలెర్ట్.. రాగల 3 రోజుల్లో వివిధ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం

|

Jun 03, 2022 | 4:27 PM

రేపు ఉత్తర కోస్తాలోని తూర్పు , పశ్చిమ గోదావరి జిల్లాల్లో, దక్షిణ కోస్తాలోని కృష్ణ, గుంటూరు జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల వడ గాలులు వీచే అవకాశం ఉంది.

AP Weather Alert: ఏపీ వాసులకు అలెర్ట్.. రాగల 3 రోజుల్లో వివిధ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం
Ap Weather Alert
Follow us on

AP Weather Alert: నేడు మే 03 వ తేదీన నైరుతి రుతుపవనాలు వాయువ్య దిశ నంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలలోకి.. ఈశాన్య ,  తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మిగిలిన భాగాలు, మొత్తం ఈశాన్య రాష్ట్రాల మీదుగా ఉప హిమాలయన్‌లోని కొన్ని భాగాలోని పశ్చిమ బెంగాల్ ,  సిక్కిం లోకి మరింత ముందుకు సాగాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో  గ్యాంగ్టక్ ,పశ్చిమ బెంగాల్ నుండి ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు ఉన్న ద్రోణి..  ప్రస్తుతం తూర్పు – ఉత్తర ప్రదేశ్ నుండి కోస్తా ఆంధ్ర ప్రదేశ్ వరకు సగటు సముద్ర మట్టమునకు 0 . 9 కి .మీ ఎత్తులో వ్యాపించి ఉంది. దీంతో రానున్న మూడు రోజుల పాటు ఏపీలో వాతావరణం ఎలా ఉండనున్నదో అమరావతి వాతావరణ శాఖ ప్రకటించింది.

ఉష్ణో గ్రత- వడగాలులు:
రేపు ఉత్తర కోస్తాలోని తూర్పు , పశ్చిమ గోదావరి జిల్లాల్లో, దక్షిణ కోస్తాలోని కృష్ణ, గుంటూరు జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల వడ గాలులు వీచే అవకాశం ఉంది. అంతేకాదు.. రాగల రెండు రోజుల్లో ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళం,  విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లోను ,దక్షిణ కోస్తాలోని కృష్ణ, గుంటూరు జిల్లాల్లోనూ గరిష్ట ఉష్ణో గ్రతలు సగటు ఉష్ణోగ్రతల కంటే 2 నుండి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది. రాయలసీమలో రానున్న రెండు రోజుల్లో గరిష్ట ఉష్ణో గ్రతల్లో పెద్దగా మార్పులుండవని చెప్పారు.

రానున్న మూడు రోజులకు వాతావరణ సూచన: 

ఇవి కూడా చదవండి

ఉత్తర కోస్తా, యానాం:  ఈ రోజు, రేపు, ఎల్లుండి (జూన్ 6వ తేదీ) తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30 – 40 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది. ఎల్లుండి తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా: ఈ రోజు, రేపు, ఎల్లుండి (జూన్ 6వ తేదీ) తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.  ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.

రాయలసీమ: ఈ రోజు, రేపు, ఎల్లుండి (జూన్ 6వ తేదీ) తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..