AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: తిరుపతి, చిత్తూరులో కూటమి జైత్రయాత్ర.. రెండు కార్పొరేషన్లలోనూ వైసీపీకి ఊహించని షాక్..

AP Tirupati Corporation Mayor Profile: తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం సృష్టించింది. టీడీపీ మేయర్ అభ్యర్థి మన్నెం శ్రీనివాస ప్రసాద్ భారీ విజయంతో పీఠాన్ని దక్కించుకోగా మొత్తం 66 స్థానాల్లో కూటమి ఏకంగా 60 డివిజన్లను క్లీన్‌స్వీప్ చేసింది. అటు చిత్తూరు కార్పొరేషన్‌లోనూ టీడీపీ అభ్యర్థి కఠారి హేమలత మేయర్‌గా గెలుపొందడంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూటమి హవా స్పష్టమైంది.

Andhra Pradesh: తిరుపతి, చిత్తూరులో కూటమి జైత్రయాత్ర.. రెండు కార్పొరేషన్లలోనూ వైసీపీకి ఊహించని షాక్..
Tirupati Municipal Corporation Election Results
Krishna S
|

Updated on: Nov 03, 2026 | 8:08 PM

Share

ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ముఖ్యంగా ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి విజయదుందుభి మోగించింది. తిరుపతి మేయర్ పీఠాన్ని టీడీపీ అభ్యర్థి మన్నెం శ్రీనివాస ప్రసాద్ భారీ ఆధిక్యంతో కైవసం చేసుకున్నారు. కార్పొరేషన్ పరిధిలోని మెజారిటీ డివిజన్లలో కూటమి అభ్యర్థులకు ఓటర్లు ఏకపక్షంగా పట్టం కట్టడంతో తిరుపతిలో పసుపు-సేన జెండా రెపరెపలాడింది. తిరుపతి కార్పొరేషన్‌లోని మొత్తం 66 స్థానాలకు ఎన్నికలు జరగగా, కూటమి ఏకంగా 60 డివిజన్లను తన ఖాతాలో వేసుకుని సత్తా చాటింది. ఇందులో తెలుగుదేశం పార్టీ ఒంటరిగానే 38 డివిజన్లలో జయకేతనం ఎగురవేయగా, మిత్రపక్షాలైన జనసేన 19 స్థానాల్లో, భారతీయ జనతా పార్టీ 3 స్థానాల్లో ఘన విజయం సాధించాయి. గత ఎన్నికల్లో కార్పొరేషన్‌ను ఏలిన వైసీపీ ఈసారి కేవలం 3 డివిజన్లకే పరిమితమై ఊహించని పరాభవాన్ని మూటగట్టుకుంది. మిగిలిన 3 స్థానాల్లో స్వతంత్రులు విజయం దక్కించుకున్నారు.

చిత్తూరులోనూ పసుపు హవా

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూటమి తన పట్టును మరింత బలోపేతం చేసుకుంది. తిరుపతితో పాటు చిత్తూరు కార్పొరేషన్‌ను కూటమి ఏకపక్షంగా కైవసం చేసుకుంది. చిత్తూరు మేయర్‌గా టీడీపీ అభ్యర్థి కఠారి హేమలత విజయం సాధించారు. మొత్తం 60 స్థానాలున్న చిత్తూరు కార్పొరేషన్‌లో టీడీపీ ఏకంగా 51 డివిజన్లను క్లీన్‌స్వీప్ చేయగా, జనసేన 2, బీజేపీ ఒక డివిజన్‌లో గెలుపొందాయి. ఇక్కడ కూడా వైకాపా కేవలం 4 డివిజన్లకే పరిమితమైంది. తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్లను కూటమి సొంతం చేసుకోవడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కూటమి పార్టీల శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి.

Follow Us