AP Rains: దంచికొట్టుడే.. ఈ ప్రాంతాలకు ఉరుములతో కూడిన భారీ వర్షాలు.. వెదర్ రిపోర్ట్ ఇదిగో

|

Aug 27, 2024 | 7:41 AM

రెండు తెలుగు రాష్ట్రాలకు మరోసారి వర్షాలు దంచికొట్టనున్నాయి. ఆగష్టు 29వ తేదీ కల్లా తూర్పు మధ్య పరిసర ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలో..

AP Rains: దంచికొట్టుడే.. ఈ ప్రాంతాలకు ఉరుములతో కూడిన భారీ వర్షాలు.. వెదర్ రిపోర్ట్ ఇదిగో
Ap Rains
Follow us on

రెండు తెలుగు రాష్ట్రాలకు మరోసారి వర్షాలు దంచికొట్టనున్నాయి. ఆగష్టు 29వ తేదీ కల్లా తూర్పు మధ్య పరిసర ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలో వచ్చే మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. అలాగే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయంది వాతావరణ శాఖ.

ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. ఇక రాబోయే మూడు రోజులు ఉత్తర కోస్తాంధ్రా, యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. అటు భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే ఛాన్స్ ఉంది. ఇక ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తాంధ్రా, రాయలసీమ విషయానికొస్తే.. వచ్చే 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని తెలిపింది వాతావరణ శాఖ.

ఇది చదవండి: ఆదివారం వచ్చిందంటే ఆ గ్రామంలో నాన్-వెజ్ బంద్.. కారణం తెలిస్తే

ఇవి కూడా చదవండి

తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరం భీమ్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్ జిల్లాలకు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని.. అలాగే హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురవచ్చునని వాతావరణ శాఖ పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయంది. తెలంగాణ అంతటా ఆరు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

ఇది చదవండి: తెల్లారి షాప్ ఓపెన్ చేయగానే ఏవేవో శబ్దాలు.. భయం భయంగా అటు వెళ్లి చూస్తే

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..