AP News: భలే భలేగా.. పెన్సిల్ మొనపై బాలగోపాలుడు.. చూస్తే అవాక్ అవ్వాల్సిందే

AP News: భలే భలేగా.. పెన్సిల్ మొనపై బాలగోపాలుడు.. చూస్తే అవాక్ అవ్వాల్సిందే

Maqdood Husain Khaja

| Edited By: Ravi Kiran

Updated on: Aug 26, 2024 | 12:58 PM

శ్రీకృష్ణుని జన్మాష్టమి సందర్భంగా ఓ సూక్ష్మ కళాకారుడు భక్తిని తనదైన శైలిలో చాటుకున్నాడు. పెన్సిల్ మొనపై అతి సూక్ష్మంగా బాల గోపాలుడి కళారూపం చెక్కి ఔరా అనిపించాడు. మురళీధారుడైన బాలగోపాలుడు..

శ్రీకృష్ణుని జన్మాష్టమి సందర్భంగా ఓ సూక్ష్మ కళాకారుడు భక్తిని తనదైన శైలిలో చాటుకున్నాడు. పెన్సిల్ మొనపై అతి సూక్ష్మంగా బాల గోపాలుడి కళారూపం చెక్కి ఔరా అనిపించాడు. మురళీధారుడైన బాలగోపాలుడు ముద్దు ముద్దుగా కనిపిస్తున్నాడు. తలపై నెమలి పింఛం, చేతిలో మురళి, ఒంటికాలిపై నిలుచుని వాయిస్తున్నట్టు.. కళ్ళకు కట్టినట్టు కళారూపాన్ని సాక్షాత్కరించాడు ఈ మైక్రో ఆర్టిస్ట్.

ఉమ్మడి విశాఖ జిల్లా నక్కపల్లి మండలం చిన్న దొడ్డిగల్లు గ్రామానికి చెందిన వెంకటేష్… సందర్భానికి అనుసారం సూక్ష్మ కళాకారులు చేయడం హాబీ. ఎనిమిది మిల్లీ మీటర్ల ఎత్తు, పదనాలుగు మిల్లీ మీటర్ల వెడల్పుతో ఈ మైక్రో ఆర్ట్ చేశాడు వెంకటేష్. అయిదు గంటల పాటు శ్రమించి అద్భుతమైన కళాఖండాన్ని రూపొందించానని టీవీ9తో అన్నారు. ఇప్పటికే అనేక దేవతామూర్తుల విగ్రహాలు, కళారూపాలను పెన్సిల్ మొనపై చెక్కి ప్రశంసలు అందుకుని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ తో పాటు అనేక అవార్డులు సొంతం చేసుకున్న వెంకటేష్.. తన కృష్ణుడిపై ఉన్న భక్తిని ఈ విధంగా చాటుకున్నాడు.