Weather Report: హమ్మయ్య వాన కబురు వచ్చింది.. ఈ జిల్లాల్లో 3 రోజుల పాటు వర్షాలు! లేటెస్ట్ వెదర్ రిపోర్ట్!
ఏపీ, తెలంగాణకు మరోసారి భారత వాతావరణ కేంద్రం వర్ష సూచన చేసింది. పశ్చిమ మధ్య-వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడబోయే అల్పపీడనం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో రాబోయే మూడు రోజుల పాటు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

తెలుగురాష్ట్రాలకు వాతవారణ శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న కోస్తా ఆంధ్రప్రదేశ్‌పై సగటు సముద్ర మట్టానికి 7.6 కి.మీ ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనంనెలకొని ఉందని.. సెప్టెంబర్ 11వ నాటికి పశ్చిమ మధ్య-వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలలో అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉందని దీని ప్రభావంతో రెండు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతవారణ శాఖ తెలిపింది.
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో వాతావరణం
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో వాతావరణంలో మంగళ, బుధవారాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని.. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక గురువారం వర్షంతో పాటు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో ఈదురుగాలులు వీచే అవకాశముందని తెలిపింది.
దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్, రాయలసీమలో వాతవరణం
దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌లో మంగళ, బుధవారాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని.. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముందని తెలిపింది. గురువారం బలమైన గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముందని.. వేడి , తేమ, అసౌకర్యమైన వాతావరణం ఒకటి లేదా రెండు చోట్ల ఏర్పడే అవకాశముందని తెలిపింది. ఇక రాయలసీమలోనూ ఇలాంటి వాతావరణమే ఉండబోతుందని వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణలో రాబోయే మూడు రోజుల వాతావరణం ఇలా
ఇక అల్పపీడనం ప్రభావంతో ఇటు తెలంగాణలో కూడా మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని.. గురువారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.అలాగే కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, 30 నుండి 40 కి మీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
