Atchannaidu Naidu: అయ్యో.. అచ్చెన్న పడిపోయారే.. ప్రభుత్వ కార్యక్రమంలో ఘటన..

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కిందపడిపోయారు. సోఫాలో కూర్చుంటూనే వెనక్కి వాలిపోయారు. ఆయనతో పాటు ఎంపీ రామ్మోహన్‌ నాయుడు కూడా కిందపడ్డారు. ఇద్దరికీ..

Atchannaidu Naidu: అయ్యో.. అచ్చెన్న పడిపోయారే.. ప్రభుత్వ కార్యక్రమంలో ఘటన..
Atcham Naidu Felldown

Edited By: Anil kumar poka

Updated on: Oct 13, 2021 | 3:46 PM

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కిందపడిపోయారు. సోఫాలో కూర్చుంటూనే వెనక్కి వాలిపోయారు. ఆయనతో పాటు ఎంపీ రామ్మోహన్‌ నాయుడు కూడా కిందపడ్డారు. ఇద్దరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అక్కడున్న వాళ్లంతా ఊపిరిపీల్చుకున్నారు. స్వాతంత్ర సమరయోధుడు సర్దార్‌ గౌతు లచ్చన్న పేరుతో కేంద్ర ప్రభుత్వం పోస్టల్ స్టాంప్‌ విడుదల చేసింది. దానికి సంబంధించిన ఆవిష్కరణ కార్యక్రమంలో ఈ ఆపశృతి చోటుచేసుకుంది. అయితే బాబాయ్‌ అబ్బాయిలిద్దరికీ ఎలాంటి గాయాలు కాలేదు. వెనకాల ఉన్న సోఫా దూరంగా ఉండడంతో ఇద్దరికీ ప్రమాదం తప్పింది. వెంటనే అలర్టయిన గన్‌మెన్లు వారిని పైకి లేపారు. ఆ తర్వాత యధావిధిగా పోస్టల్ స్టాంప్ ఆవిష్కరణ కార్యక్రమం కొనసాగింది.

ఇవి కూడా చదవండి: Telugu Academy: తెలుగు అకాడమీలో స్కామ్‌లో మరో కొత్త కోణం.. సాయికుమార్‌ ముఠాపై పోలీసుల స్పెషల్ ఫోకస్..

Saddula Bathukamma: సద్దుల బతుకమ్మకు సిద్ధమైన తెలంగాణ పల్లెలు.. కొన్నిచోట్ల ఇవాళ, మరొకొన్ని చోట్ల గురువారం..