Andhra Pradesh: అగ్గిపెట్టెల‌కు, కొవ్వొత్తులకు రూ.23 కోట్లు.. వివరణ ఇచ్చిన ఆర్పీ సిసోడియా

వ‌ర‌ద స‌హాయ‌క చ‌ర్యల్లో భాగంగా అగ్గిపెట్టెలు, కొవ్వొత్తుల‌కు రూ.23 కోట్లు ఖ‌ర్చు చేశార‌ంటూ సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆ:ధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కార్ తీవ్రంగా ఖండించింది.

Andhra Pradesh: అగ్గిపెట్టెల‌కు, కొవ్వొత్తులకు రూ.23 కోట్లు.. వివరణ ఇచ్చిన ఆర్పీ సిసోడియా
Andhra Government
Follow us
Balaraju Goud

|

Updated on: Oct 07, 2024 | 6:00 AM

బుడమేరు పేరు చెబితేనే బెజవాడ ఇప్పటికీ గజగజ వణుకుతూనే ఉంది. రికార్డ్ స్థాయి వరదలతో సింగ్‌నగర్ సహా అనేక కాలనీలు వరద నీళ్లల్లోనే నానిపోయాయి. వెంటనే అప్రమత్తమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపాదికన సహాయక చర్యలు చేపట్టింది. వరద పీడిత ప్రాంతాలు ఇప్పటికీ కోలుకోనే లేదు.

అయితే వ‌ర‌ద స‌హాయ‌క చ‌ర్యల్లో భాగంగా అగ్గిపెట్టెలు, కొవ్వొత్తుల‌కు రూ.23 కోట్లు ఖ‌ర్చు చేశార‌ంటూ సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర సర్కార్ తీవ్రంగా స్పందించింది. కొంద‌రు ప‌నిగ‌ట్టుకుని చేస్తున్న అస‌త్య ప్రచారాల‌కు పూనుకుంటున్నారని ఖండించింది. ఏపీ ప్రభుత్వ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యద‌ర్శి ఆర్పీ సిసోడియా ఈ మేరకు ఒక ప్రక‌ట‌న‌ విడుదల చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ ఫేక్ ప్రచారాల‌ని కొట్టిపారేశారు. కొంత‌మంది ప్రభుత్వంపై బుర‌ద చ‌ల్లడమే పనిగా పెట్టుకున్నారన్నారు. ప్రజ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించడం కోసం ఇలాంటి అస‌త్య ప్రచారాల‌ు చేస్తున్నార‌ని మండిపడ్డరు.

విజయవాడలో వ‌ర‌ద‌ల కార‌ణంలో వ‌ర‌ద బాధిత ప్రాంతాల్లో విద్యుత్తు స‌ర‌ఫ‌రా లేక రాత్రిళ్లు ప్రజ‌లు తీవ్ర అవ‌స్థలు ప‌డ్డారు. వారికి రాత్రి సమయాల్లో ఇబ్బందులు త‌లెత్తకుండా మొబైల్ జ‌న‌రేట‌ర్లు త‌ల‌రించి స‌హాయ‌క చ‌ర్యలు చేప‌ట్టామ‌ని ఆయన వివరణ ఇచ్చారు. సామాజిక మాధ్య‌మాల్లో కొంద‌రు చేస్తున్నట్లుగా కేవ‌లం కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు పంపిణీకి రూ.23 కోట్లు వెచ్చించామ‌న‌డం పూర్తిగా నిరాధార‌మైందని సిసోడియా కొట్టిపారేశారు. ఈ ఖ‌ర్చు ప్ర‌ధానంగా మొబైల్ జ‌న‌రేటర్ల కోసం వెచ్చించింద‌ని తెలిపారు. దీంతో పాటు వ‌ర‌ద బాధితుల‌కు అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులు కూడా అద‌నంగా అందించామ‌ని స్ప‌స్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న ఇలాంటి తప్పుడు ప్ర‌చాల‌ను ప్ర‌జ‌లు ఏమాత్రం విశ్వ‌సించ‌కుండా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ఆ వ్యాన్‌లో ఉన్నది ఫర్నీచర్ కాదు గురూ..!
ఆ వ్యాన్‌లో ఉన్నది ఫర్నీచర్ కాదు గురూ..!
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్
గురు శిష్య గ్రహాల యుతి.. ఆ రాశుల వారికి కనక వర్షం..!
గురు శిష్య గ్రహాల యుతి.. ఆ రాశుల వారికి కనక వర్షం..!
50 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్‌గా, చలాకీగా ఉండాలా.. ఈ టిప్స్ మీ కోసం
50 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్‌గా, చలాకీగా ఉండాలా.. ఈ టిప్స్ మీ కోసం
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
వాయుగుండం ఉగ్రరూపం..బాబోయ్.! ఏపీలో వచ్చే 3 రోజులు వర్షాలే వర్షాలు
వాయుగుండం ఉగ్రరూపం..బాబోయ్.! ఏపీలో వచ్చే 3 రోజులు వర్షాలే వర్షాలు