Andhra Pradesh: ఏపీలో ఆగని సారాయి రచ్చ ..నాటుసారా కేంద్రాలపై ఎస్‌ఈబీ అధికారుల ఉక్కుపాదం

|

Mar 16, 2022 | 6:03 PM

Andhra Pradesh: ఏపీలో సారా మరణాలు పొలిటికల్‌ హీట్‌(Political Heat) పెంచుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నాటుసారా తయారీ కేంద్రాలపై ఎక్సైజ్‌ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. జంగారెడ్డి గూడెం(Jangareddy Gudem) లో సారే..

Andhra Pradesh: ఏపీలో ఆగని సారాయి రచ్చ ..నాటుసారా కేంద్రాలపై ఎస్‌ఈబీ అధికారుల ఉక్కుపాదం
Adulterated Alcohol In Jan
Follow us on

Andhra Pradesh: ఏపీలో సారా మరణాలు పొలిటికల్‌ హీట్‌(Political Heat) పెంచుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నాటుసారా తయారీ కేంద్రాలపై ఎక్సైజ్‌ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. జంగారెడ్డి గూడెం(Jangareddy Gudem) లో సారే లేదని ఓవైపు సీఎం చెబుతున్నా..మరోవైపు పోలీసులు సారా తయారీదారులపై విరుచుకు పడుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా(West Godavari) జంగారెడ్డిగూడెంలో సారా మరణాలు సంచలనం రేపుతున్నాయి. ఓ వైపు అక్కడ సారా లేనేలేదని సీఎం జగన్‌ ప్రకటిస్తున్నా.. మరోవైపు సారా తయారీదారులు, విక్రేతలపై ఉక్కుపాదం మోపుతున్నారు ఎక్సైజ్‌ పోలీసులు. జంగారెడ్డిగూడెంలో సారా తయారీ కేంద్రాలపై ఎస్‌ఈబీ అధికారులు విరుచుకు పడుతున్నారు. నాటుసారా తయారు చేస్తున్న 22 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి 18 వేల 300 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. వందల లీటర్లలో బెల్లం పానకాన్ని పారబోశారు. నాటుసారా తయారు చేస్తున్న వారిపై 10 కేసులు నమోదు చేశారు.

జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 148 కేసులు నమోదు చేసినట్లు చెబుతున్నారు పోలీసులు. జంగారెడ్డిగూడెంతోపాటు జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం, పంగిడి గూడెంలో దాడులు చేశారు ఎస్‌ఈబీ అధికారులు. రాష్ట్రవ్యాప్తంగా నాటుసారా తయారీ కేంద్రాలపై ఉక్కుపాదం మోపుతున్న ఎక్సైజ్‌ అధికారులు.. నాలుగురోజుల్లోనే 1129 కేసులు నమోదు చేశారు. 677 మందిని అరెస్టు చేశారు. ఒక్క జంగారెడ్డి గూడెంలోనే పదుల సంఖ్యలో కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా సారా తయారీకి ఉపయోగించే 5 లక్షల 76 వేల 710 లీటర్ల బెల్లపు పానకాన్ని ధ్వంసం చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అంతేకాదు..13 వేల 471 లీటర్ల సారాతోపాటు 47 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఏపీలో వెలుగుజూస్తున్న కేసులు, దాడులను బట్టి సారాతయారీ ఏ రేంజ్‌లో ఉందో ఇట్టే అర్థమవుతుందంటున్నాయి విపక్షాలు. ఇకనైనా ప్రభుత్వం ప్రజలకు మాయమాటలు చెప్పడం మాని..సారాను అరికట్టాలని సూచిస్తున్నాయి.

Also Read:

Telangana: ప్రేమికుడి బొమ్మ గీసి చనిపోయిన ప్రియురాలు.. పాపం బాధను తట్టుకోలేక

Tea Party: గిన్నిస్‌ రికార్డులకెక్కిన టీ పార్టీ… నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో స్పెషల్‌ ఏంటో తెలుసా..!