Road Accident: లారీని ఢీ కొన్న బైక్.. యస్పీ చొరవతో ప్రాణాపాయంలో ఉన్న క్షతగాత్రులకు సీపీఆర్‌

పోలీస్ ఉన్నతాధికారి మానవతను చూపించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయాలపాలై ఆపదలో ఉన్న వ్యక్తులను చూసిన ఆ జిల్లా ఎస్పీ చలించిపోయారు. వెంటనే చికిత్స అందించే చర్యలు చేపట్టారు. స్వయంగా అంబులెన్స్‌కు కాల్ చేసి క్షతగాత్రులను రక్షించేందుకు ప్రయత్నించారు. పశ్చిమగోదావరి జిల్లా లంకలకోడేరు నుంచి వీరవాసరం వెళ్లే మార్గం మధ్యంలో ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొంది. బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా లారీని గుద్దడం వల్ల స్పృహ తప్పి..

Road Accident: లారీని ఢీ కొన్న బైక్.. యస్పీ చొరవతో ప్రాణాపాయంలో ఉన్న క్షతగాత్రులకు సీపీఆర్‌
SP Ravi Prakash administered CPR to road accident victims

Edited By:

Updated on: Nov 08, 2023 | 6:48 PM

ఏలూరు, నవంబర్‌ 8: పోలీస్ ఉన్నతాధికారి మానవతను చూపించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయాలపాలై ఆపదలో ఉన్న వ్యక్తులను చూసిన ఆ జిల్లా ఎస్పీ చలించిపోయారు. వెంటనే చికిత్స అందించే చర్యలు చేపట్టారు. స్వయంగా అంబులెన్స్‌కు కాల్ చేసి క్షతగాత్రులను రక్షించేందుకు ప్రయత్నించారు. పశ్చిమగోదావరి జిల్లా లంకలకోడేరు నుంచి వీరవాసరం వెళ్లే మార్గం మధ్యంలో ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొంది. బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా లారీని గుద్దడం వల్ల స్పృహ తప్పి పడిపోయారు.

అదే సమయంలో అటుగా ఎస్పీ రవిప్రకాష్ వెళ్తున్నారు. రాబోయే ఎలక్షన్ కు సంబంధించిన స్ట్రాంగ్ రూమ్ భద్రత ప్రమాణాల వెరిఫికేషన్‌లో భాగంగా అటు వైపు వెళ్తున్నారు. ప్రమాదాన్ని గమనించిన ఎస్పీ రవిప్రకాష్ తక్షణమే స్పందించారు. కారు దిగి క్షతగాత్రులకు తన సిబ్బందితో సీపీఆర్ చేయించారు. స్వయంగా అంబులెన్స్ కి కాల్ చేసారు. అంబులెన్స్ వచ్చే వరకూ అక్కడే ఉన్నారు. క్షతగాత్రులను అంబులెన్సులో ఎక్కించి వైద్యం అందించేందుకు హాస్పిటల్‌కు తరలించారు. ఘటనా స్థలం పరిధిలోని పోలీస్ స్టేషన్ సీఐ, ఎస్ఐలకు కాల్ చేసి తక్షణమే చర్యలు తీసుకోవలసుందిగా సూచనలు చేశారు.

క్షతగాత్రుల వివరాలు తెలుసుకుని వారి బంధువులకు సమాచారం అందించామని ఎస్పీ రవి ప్రకాష్ తెలిపారు. విధినిర్వహణలో జిల్లా వాసుల సంక్షేమంతో పాటు సమయానుకూలంగా ఎస్పీ రవిప్రకాష్ మానవతావాదాన్ని చాటుతున్నారు. ఎస్పీ గారి మానవతా దృక్పథము, నిరాడంబరత పై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.