అనంతపురం, ఆగస్టు 20: రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం మూలంగా ఓ రైల్వే ఉద్యోగి నిండు ప్రాణం గాల్లోకలిసిపోయింది. రైలు ఇంజన్‌లోని డీజిల్ ఇంజన్లను మరమ్మత్తు చేస్తుండగా మరో మెకానిక్ ప్రెషర్ ఫ్యాన్ రబ్బర్ ఆన్ చేయడంతో ఫాన్‌లో చిక్కుకుని మరో గ్రేడ్ వన్ మెకానిక్ ముక్కలై మృతి చెందాడు. ఈ ఘటనలో అతని మృత దేహం మాంసం ముద్దగా మారిపోయింది. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే స్టేషన్ పరిధిలో ఆదివారం (ఆగస్టు 20) చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..
అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే లోకో షెడ్‌లో దారుణ ప్రమాదం. రైల్ ఇంజన్ రిపేరు చేస్తుండగా ప్రమాదవశాత్తు శాంతారాం అనే ఉద్యోగి దుర్మరణం. అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే లోకో షెడ్ లో డీజిల్ ఇంజన్లకు మరమ్మతు చేస్తుండగా ప్రమాదవశాత్తు శాంతారామ్ అనే గ్రేడ్ వన్ మెకానిక్ దుర్మరణం పాలయ్యాడు. రైలు ఇంజన్ లోని ప్రెషర్ ఫ్యాన్ రబ్బర్ లు మారుస్తుండగా మరో ఉద్యోగి దీనిని గమనించకుండా రైలు ఇంజన్ ఆన్ చేయడంతో ఫ్యాన్ రెక్కల మధ్య చిక్కుకొని శాంతారాం దేహం చిద్రం అయ్యి ముక్కలయింది. అయితే ఏదైనా ఇంజన్ మరమ్మత్తులు చేసే సమయంలో రైలు ఇంజన్ ఆన్ చేసే సమయంలో ముందుగా “సమాలో” అంటూ హెచ్చరికలు చేయడమే కాకుండా రైలు ఇంజన్ చుట్టూ తిరిగి… పైనా క్రింద ఎవరైనా మరమ్మత్తులు చేస్తున్నారా? లేదా? అన్న విషయాన్ని గమనించి మూడుసార్లు సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఇంజన్ ను ఆన్ చేయాలి.
అలాగే ఇంజిన్ మరమ్మతులు చేసే సమయంలో “నాట్ టు బి క్రాంక్డ్”అని హెచ్చరిక బోర్డులను కూడా పెట్టాలి అయితే ఈ నిబంధనలన్నీ పాటించారా? లేదా? అనే విషయం అధికారులు విచారణలో తేల్చాల్సి ఉంది. ప్రమాద సమాచారం అందిన వెంటనే రైల్వే ఉన్నతాధికారులు సిబ్బంది అక్కడికి చేరుకొని పరిస్థితి సమీక్షిస్తున్నారు. శాంతారామ్ దేహం మొత్తం మాంసం ముద్దగా ముక్కలు ముక్కలుగా మారిపోవడంతో దానిని బయటికి తీయడానికి రైలు ఇంజన్ పైభాగాన్ని తొలగించాల్సి ఉండటంతో ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.