AP News: ఏపీ విద్యార్ధులకు కొత్త ప్రభుత్వం అద్దిరిపోయే గుడ్‌న్యూస్.. ఇది కదా కావాల్సింది..

|

Jun 12, 2024 | 7:16 AM

ఏపీ విద్యార్ధులకు కొత్త ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ అందించింది. ఈ నెల 13 నుంచే యధాతధంగా విద్యాకానుక కిట్లను విద్యార్ధులకు పంపిణీ చేయనున్నట్టు తెలిపింది. గడిచిన ఎన్నికల్లో విజయం సాధించి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో 'జగనన్న విద్యాకానుక' కింద అందించే.. ఆ వివరాలు ఇలా..

AP News: ఏపీ విద్యార్ధులకు కొత్త ప్రభుత్వం అద్దిరిపోయే గుడ్‌న్యూస్.. ఇది కదా కావాల్సింది..
Students
Follow us on

ఏపీ విద్యార్ధులకు కొత్త ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ అందించింది. ఈ నెల 13 నుంచే యధాతధంగా విద్యాకానుక కిట్లను విద్యార్ధులకు పంపిణీ చేయనున్నట్టు తెలిపింది. గడిచిన ఎన్నికల్లో విజయం సాధించి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ‘జగనన్న విద్యాకానుక’ కింద అందించే ఉచిత పుస్తకాలు,యూనిఫామ్‌తో కూడిన కిట్స్ సంగతేంటనే ప్రశ్న గత కొన్నిరోజులుగా ప్రజల్లో తలెత్తింది. అయితే ఎలాంటి మార్పులు చేయకుండా.. ఈ స్టూడెంట్ కిట్లను యథావిధిగా పంపిణీ చేయాలని నిర్ణయించారు చంద్రబాబు. వాటికి మార్పులు చేస్తే.. ఇప్పుడు ప్రభుత్వానికి కోట్లలో నష్టం వచ్చే అవకాశం ఉండటంతో.. మాజీ సీఎం వైఎస్ జగన్ ఫోటోతోనే స్టూడెంట్ కిట్లను పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారట.

దీన్ని బట్టి చూస్తే.. ఈసారి విద్యార్ధులకు అందించే స్టూడెంట్ కిట్లపై గతంలో మాదిరిగానే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండనుంది. ఇప్పటికే విద్యాశాఖ అధికారులు ఈ కిట్లలో పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు ఉంచి స్కూళ్ల వారీగా కేటాయించారు. బెల్టులు, షూలు, పుస్తకాలు.. ఇలా అన్ని కూడా స్టూడెంట్ కిట్లలో ఉన్నాయో.. లేదో.. సరిగ్గా చూసి.. ప్రతీ జిల్లాలోని స్కూల్స్‌కు ఆయా కిట్లను చేరవేసేలా చర్యలు తీసుకుంది విద్యాశాఖ. స్కూళ్లు ప్రారంభమయ్యే జూన్ 13 నుంచే పంపిణీ కార్యక్రమం ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసింది. అటు గత ప్రభుత్వంలో విద్యా కానుకలో భారీగా అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో వాటిపై విచారణ చేయాలని కొత్త ప్రభుత్వం నిర్ణయించింది.

ఇది చదవండి: ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి బ్రో.! కారు నెంబర్ ప్లేట్‌లో ఏముందో తెలిస్తే..

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి