Peddireddy: ‘చంద్రబాబు మోసపు మాటలు ఎవరూ నమ్మరు’.. మంత్రి పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు..
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలో పర్యటించిన మంత్రి పెద్దిరెడ్డి పలు కార్యక్రమంలో పాల్గొన్నారు. శనివారం పీలేరు బహిరంగ సభలో పెద్దిరెడ్డిపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పాపాల పెద్దిరెడ్డి అన్న చంద్రబాబుకు గట్టి కౌంటర్ ఇచ్చారాయన. చంద్రబాబు నా పై మితిమీరి విమర్శలు చేస్తున్నారన్నారన్నారు.

చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలో పర్యటించిన మంత్రి పెద్దిరెడ్డి పలు కార్యక్రమంలో పాల్గొన్నారు. శనివారం పీలేరు బహిరంగ సభలో పెద్దిరెడ్డిపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పాపాల పెద్దిరెడ్డి అన్న చంద్రబాబుకు గట్టి కౌంటర్ ఇచ్చారాయన. చంద్రబాబు నా పై మితిమీరి విమర్శలు చేస్తున్నారన్నారన్నారు. తనలాగా మామను వెన్నుపోటు పొడవలేదని గుర్తు చేశారు. చంద్రబాబు అధికారంలోకి రాలేడన్నారు పెద్దిరెడ్డి. కనీసం కుప్పంలో కూడా చంద్రబాబు గెలవలేడన్నారు. కుప్పంకు హంద్రీనీవా ద్వారా వైసీపీ సర్కార్ నీరు ఇస్తోందన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఏం చేశాడని ప్రశ్నించారు. రాజకీయంగా ఎదుర్కోలేక చౌకబారు విమర్శలకు దిగారని ఆరోపించారు.ఓటమి భయంతో చంద్రబాబు మాట్లాడుతున్నారన్నారు.
2014లో ఇచ్చిన హామీలు చంద్రబాబు నెరవేర్చారా అని ప్రశ్నించారు. చంద్రబాబు మోసం మాటలు ఎవరూ నమ్మరన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తే శ్రీలంక అవుతుందన్న చంద్రబాబు.. ఇప్పుడు బాబు షూరిటి – భవిషత్తు గ్యారంటీ అంటున్నారన్నారు. ఇంటికో ఒక ఉద్యోగమని చెప్పి అధికారంలోకి రాగానే రెండు లక్షల కాంట్రాక్ట్ ఉద్యోగాలు తొలగించారన్నారు. ఇన్నిసార్లు మోసం చేసిన చంద్రబాబు మాటలు ఎవరూ నమ్మరన్నారు. సీఎం వైఎస్ జగన్ పార్టీలు చూడకుండా పథకాలు అందిస్తున్నారన్నారు. గతంలో జన్మభూమి కమిటీలు పెట్టీ తమకు కావాల్సిన వారికి మాత్రమే పథకాలు ఇచ్చారన్నారు. పేదరికాన్ని కొలబద్దగా తీసుకుని ప్రజలకు అండగా నిలిచింది సీఎం జగన్ మాత్రమేనన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజే పథకాలు అమలు పై సీఎం జగన్ దృష్టి సారించారన్నారు. పాపాలు చేసింది చంద్రబాబు అయితే తనని పాపాల పెద్దిరెడ్డి అని విమర్శిస్తున్నారని రామచంద్రారెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు మోసపూరిత మాటలు నమ్మొద్దని ప్రజలకు దిశానిర్ధేశం చేశారు. చౌకబారు మాటలు కొనసాగిస్తే చంద్రబాబును ప్రజలే రాళ్లతో కొడతారన్నారు పెద్దిరెడ్డి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..