Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం ఊరట.. 5 కేజీల గ్యాస్ సిలిండర్ పంపిణీకి రంగం సిద్దం..
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేసింది. రాష్ట్రంలో 5 కేజీల గ్యాస్ సిలిండర్ పంపిణీకి రంగం సిద్దం చేసుకుంది. వీటి పంపిణీకి చర్యలు చేపట్టాలని గ్యాస్ ఏజెన్సీలకు సూచించింది. మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సూచించారు.

ఏపీ ప్రజలకు మంత్రి నాదెండ్ల మనోహర్ శుభవార్త తెలిపారు. 5 కేజీల గ్యాస్ సిలిండర్‌పై కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో 5 కేజీల సిలిండర్లను పంపిణీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఇందుకు అవసరమైన మార్గదర్శకాలను సిద్దం చేశామని, దాని ప్రకారం పంపిణీ చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఎల్పీజీ గ్యాస్ ఏజెన్సీలతో నాదెండ్ల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్యాస్ సిలిండర్ల విషయంలో ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని, కొరత లేదని స్పష్టం చేశారు. గ్యాస్ ఏజెన్సీలు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొనగా.. పలు కీలక సూచనలు వారికి చేశారు. వాటి వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
5 కేజీల సిలిండర్లు పంపిణీ
ఏపీలో 5 కేజీల సిలిండర్లను పంపిణీ చేయాలని ఏజెన్సీలకు నాదెండ్ల మనోహర్ సూచించారు. ఎఫ్‌టీఎల్ సిలిండర్లుగా వీటిని పిలుస్తుండగా.. వీటిని కొనుగోలు చేస్తే ఎలాంటి సబ్సిడీ రాదు. కానీ తక్కువ ధరకే ఇవి అందబాటులో ఉంటాయి. నేరుగా గ్యాస్ ఏజెన్సీ కార్యాలయానికి వెళ్లి ఏదైనా డాక్యుమెంట్ సమర్పించి తీసుకోవచ్చు. ఇందుకు ఎలాంటి సెక్యూరిటీ డిపాజిట్ లాంటివి ఉండవ్. నేరుగా వెళ్లి తీసుకుని ఇంటికి తెచ్చుకోవచ్చు. ముందుగా బుక్ చేసుకోవడం లాంటివి ఉండవు. గ్యాస్ కొరత క్రమంలో ఆయిల్ కంపెనీలు ఈ సిలిండర్లను తీసుకొచ్చాయి. వీటిని రీఫిల్లింగ్ చేసుకోవాలంటే బుకింగ్ చేసుకోవాల్సిన పని ఉండదు. నేరుగా గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి నింపుకోవచ్చు. లేదా పెట్రోల్ బంకుల్, దుకాణాల్లో ఫిల్లింగ్ చేయించుకోవచ్చు. అటు కేంద్రం కిరోసిన్ సరఫరా చేయాలని రాష్ట్రాలకు సూచించింది. దీంతో కిరోసిన్ అవసరం ఉన్నచోట్ల పంపిణీ చేయాలని మనోహర్ సూచించారు.
