AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పోట్లగిత్తల బరిలో ట్రాన్స్‌జెండర్‌… ఎద్దుల పోటీల్లో ప్రత్యేక ఆకర్షణ

మార్కాపురం జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి ఎడ్ల పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. నాలుగు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో సీనియర్, కొత్త, పాలపళ్ళ విభాగాల్లో ఎడ్లను పోటీకి దింపుతున్నారు. అయితే ఈ పోటీల్లో ...

పోట్లగిత్తల బరిలో ట్రాన్స్‌జెండర్‌... ఎద్దుల పోటీల్లో ప్రత్యేక ఆకర్షణ
Transgender Farmer
Fairoz Baig
| Edited By: |

Updated on: Apr 09, 2026 | 1:27 PM

Share

మార్కాపురం జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎడ్లపోటీలు నిర్వహిస్తున్నారు. నాలుగురోజుల పాటు నిర్వహించే ఈ పోటీలకు సీనియర్‌ విభాగం, కొత్త కేటగిరీ, పాలపళ్ళ విభాగాల్లోని ఎడ్లకు పోటీలు నిర్వహిస్తున్నారు. నాలుగురోజుల పాటు జరిగే ఈ ఎడ్డ పోటీలకు ఓ ట్రాన్స్‌జెండర్‌ పోషిస్తున్న ఎడ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మార్కాపురంజిల్లా అర్థవీడు మండలం పాపినేనిపల్లికి చెందిన పలాస వినీతగౌడ్ అనే ట్రాన్స్ జెండర్‌ తన రెండు జతల ఎడ్లను పోటీకి తీసుకొచ్చారు. వినీత ట్రాన్స్‌జెండర్‌గా ఉంటూ కొంతకాలం ఇతర ప్రాంతాల్లో ఉన్నారు. ఇటీవల తిరిగి తన స్వగ్రామానికి వచ్చి తల్లిదండ్రులు చేస్తున్న వ్యవసాయ పనుల్లో భాగం పంచుకుంటున్నారు. ఓ ఐదేళ్ళుగా ఎద్దులను పెంచుకుంటూ వాటిని పందేలకు సిద్దం చేసి బరిలో పోటీలకు దిగుతున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 20 చోట్ల జరిగిన రాష్ట్ర స్థాయి ఎడ్ల పోటీలకు తన ఎడ్లజతను తానే స్వయంగా బరిలో దించడం విశేషం. 11 సార్లు ప్రధమ బహుమతి సాధించిన వినీత ఎడ్ల జతలు మార్కాపురంలో జరిగిన తొలిరోజు పోటీలో ఏడో బహుమతిగా 10 వేల రూపాయలను గెలుచుకున్నాయి.

హోరాహోరీగా రాష్ట్రస్థాయి ఎడ్ల పోటీలు…

మార్కాపురంలోని శ్రీ లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు 16 రోజుల పాటు అంగరంగ వైభంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా రైతులను ఉత్సాహ పరిచేందుకు రాష్ట్ర స్థాయి ఒంగోలు ఎడ్ల పోటీలను ఏర్పాటు చేశారు. నాలుగురోజుల పాటు జరిగే ఈ పోటీలకు రాష్ట్ర వ్యాప్తంగా పలు ఎడ్ల జతలతో రైతులు హాజరయ్యారు. బండ లాగుడు పోటీల్లో ఎద్దులు హోరాహోరీగా తలపడుతున్నాయి. తొలిరోజు రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన 13 జతల ఎద్దులు పోటీల్లో పాల్గొన్నాయి. పోటీలను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పోటీల్లో గెలిచిన ఎడ్లకు మొదటి బహుమతి 70 వేలు, రెండో బహుమతి 60 వేలుగా నిర్ణయించారు. తొలిరోజు పోటీల్లో మొదటి బహుమతిని నంద్యాలజిల్లా సాంబవరం గ్రామానికి చెందిన రైతులు జూపల్లి ప్రభాకర్‌రెడ్డి ఎడ్లు గెలుచుకోవడం విశేషం.

Also Read:  ఈ ఒక్క పని చేస్తే పిండి పురుగు అంతా మాడి మసైపోద్ది అంతే.. 

Follow Us