Kodali Nani: చంద్రబాబుకు అధికారం ఉన్నా.. లేకున్నా నేను భయపడేది లేదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలి

Kodali Nani: ఏపీలో రాజకీయాలు కాకరేపుతున్నాయి. రోజురోజుకు ఒకరిపై ఒకరు విమర్శల వర్షం కురిపించుకుంటున్నారు. రోజురోజుకు వేడెక్కుతున్న రాజకీయాలపై ఒకరిపై ఒకరు..

Kodali Nani: చంద్రబాబుకు అధికారం ఉన్నా.. లేకున్నా నేను భయపడేది లేదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలి

Updated on: Dec 03, 2021 | 7:38 PM

Kodali Nani: ఏపీలో రాజకీయాలు కాకరేపుతున్నాయి. రోజురోజుకు ఒకరిపై ఒకరు విమర్శల వర్షం కురిపించుకుంటున్నారు. రోజురోజుకు వేడెక్కుతున్న రాజకీయాలపై ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి దిగుతున్నారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని టీవీ9తో మాట్లాడారు. నవంబర్‌ 20న చంద్రబాబు అసెంబ్లీ వేదికగా చేసుకుని జగన్ బాబాయ్ గురించి మాట్లాడారు. అక్కడేదో జరిగిందని భ్రమ కల్పించేలా చంద్రబాబు నటన ప్రదర్శించారు. రాజకీయ అవసరాల కోసం అసెంబ్లీని వాడుకున్నారని ఆరోపించారు. అక్టోబర్ 22న వంశీ మీడియాతో మాట్లాడితే అప్పుడే చంద్రబాబు ఏడవాలి కదా.. అంటూ ప్రశ్నించారు.

చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలి:

అసెంబ్లీని అవమానించినందుకు చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని మంత్రి కొడాలి నాని డిమాండ్‌ చేశారు. ఒక మహిళను రాజకీయ అవసరాల కోసం రోడ్డుపై నిలబెట్టారు. మొత్తం అల్లరి చేసేది చంద్రబాబు అయితే.. మేము ముగింపు పలకడం ఏంటి?.. తన భార్యను చంద్రబాబు అంతర్జాతీయంగా అల్లరి చేసుకున్నారు. ప్రజల సింపతి కోసం చంద్రబాబు ఏదైనా వాడేస్తాడు అంటూ మండిపడ్డారు. ప్రజాక్షేత్రంలోనే చంద్రబాబును ఓడించారు కొత్తగా తేల్చుకునేది ఏముంది?.. ప్రెస్‌మీట్‌ పెట్టిన ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు మాకు తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదు. 2024 లో చంద్రబాబు అసెంబ్లీలో కాలు పెట్టలేరని స్పష్టం చేశారు. అందుకే ముందుగానే వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించుకున్నాడని ఎద్దెవా చేశారు. చంద్రబాబుకు అధికారం ఉన్నా.. లేకున్నా నేను భయపడేది లేదని వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

CM Jagan: ఉద్యోగులకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ గుడ్‌న్యూస్‌.. పీఆర్సీపై కీలక ప్రకటన

Coronavirus: కళాశాలలో కరోనా కలకలం.. 56 మంది విద్యార్థులకు కోవిడ్‌ పాజిటివ్‌..!