రోజుకు 300 మంది జంప్.. మాతృభూమిపై తగ్గుతోన్న మమకారం.. పౌరసత్వానికి చెల్లుచీటీ ఇస్తున్న లక్షలాది మంది భారతీయులు

పౌరసత్వాన్ని సైతం వదులుకొని, మాతృదేశాన్ని వీడి లక్షల సంఖ్యలో విదేశాలకు ఎందుకు వెళ్ళిపోతున్నారు. భారత రాజ్యాంగం ఏక కాలంలో రెండు దేశాల పౌరసత్వాలు కలిగి ఉండటాన్ని అనుమతించదు. ఇండియన్‌ సిటిజన్‌ షిప్‌..

రోజుకు 300 మంది జంప్.. మాతృభూమిపై తగ్గుతోన్న మమకారం.. పౌరసత్వానికి చెల్లుచీటీ ఇస్తున్న లక్షలాది మంది భారతీయులు
Indian Citizen Given Up
Follow us

|

Updated on: Dec 03, 2021 | 7:27 PM

దేశాన్ని వీడి, వలసబాటపడుతోన్న భారతీయుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. అయితే మాతృదేశాన్ని శాశ్వతంగా వీడుతోన్న వారి సంఖ్య సైతం పీక్స్‌కి చేరుతోంది. కేవలం ఐదేళ్ళలో భారతీయ పౌరసత్వాన్ని వీడి విదేశాలకు వెళ్ళిన వారి సంఖ్య అక్షరాలా ఆరు లక్షలకు పైమాటే. అసలింతకీ ఇంత భారీ సంఖ్యలో స్వదేశీ పౌరసత్వాన్ని ఎందుకు వీడుతున్నారు? విదేశాలపై క్రేజా? డాలర్‌పై మోజా? అసలు కారణమేంటో తెలిస్తే షాక్ అవుతాం.

పౌరసత్వానికి చెల్లుచీటీ ఇస్తున్న లక్షలాది మంది భారతీయులు. ఐదేళ్లలో అక్షరాలా ఆరు లక్షల మంది భారత్‌ సిటిజన్‌షిప్‌కి గుడ్‌బై చెప్పారు. పుట్టిన గడ్డను వీడి తరలిపోతోన్న భారతీయులు. భారతీయులకు మాతృభూమిపై మమకారం తగ్గుతోందా? ప్రపంచదేశాలపై ప్రేమ పెరుగుతోందా? యావత్‌ భారతావని ఖంగుతినే నిజం మాత్రం ఇదే. లక్షలాది మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని అవలీలగా వదులుకుంటున్నారు.

2015-19 మధ్య కేవలం ఐదేళ్ళ కాలంలో ఏకంగా 6.76 లక్షలమంది భారతీయ పౌరసత్వానికి గుడ్‌బై చెప్పారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్‌ లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ ఐదేళ్ళ కాలంలో ఆరు లక్షల మందికి పైగా భారతీయులు తమ పౌరసత్వాన్ని త్యజించినట్టు పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.

బతుకుదెరువు కోసమో, ఉన్నత చదువులకోసమో, విదేశాలకు వెళ్ళి, అక్కడ స్థిరపడుతోన్న లక్షలాది మంది భారతీయులు ఇప్పుడు స్వదేశీ పౌరసత్వానికి చెల్లుచీటీ ఇస్తున్నారు.

ప్రతియేటా ఎంతమంది భారతీయులు తమ మాతృదేశ పౌరసత్వాన్ని వదులుకుంటున్నారో చూద్దాం..

2017             – 1,33,049 మంది భారతీయులు స్వదేశీ పౌరసత్వాన్ని వదులుకున్నారు.

2018             – 1,34,561 మంది ఇండియన్స్‌ తమ సిటిజన్‌షిప్‌ని వదులుకున్నారు.

2019             -1,44,017 మంది దేశ పౌరసత్వానికి గుడ్‌బై చెప్పారు

2020            -85,248 మంది భారతీయులు దేశ పౌరసత్వాన్ని వదులుకున్నారు.

2021            (సెప్టెంబర్‌ 10 వరకు)- సిటిజన్‌షిప్‌ని వదులుకున్న వారు 1,11,287.

ఒక్క 2020లో మినహా ప్రతియేటా భారతీయ సిటిజన్‌ షిప్‌ని వదులుకుంటోన్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. 2019లో అత్యధిక మంది భారతీయులు ఇండియన్‌ సిటిజన్‌షిప్‌కి గుడ్‌బై చెప్పేశారు. 2021లో దేశ పౌరసత్వాన్ని వీడిన వారి సంఖ్య పీక్స్‌కి చేరింది. 2020లో అతి తక్కువ మంది దేశపౌరసత్వాన్ని వదులుకోవడానికి కారణం కోవిడ్ అయి ఉంటుందన్నది నిపుణుల అంచనా.

స్వదేశీ పౌరసత్వాన్ని వదులుకుంటామంటూ ముందుకొస్తోన్న వారిలో 40 శాతం అమెరికాలో ఉంటున్నవారే కావడం విశేషం. అమెరికా తరువాత ఆస్ట్రేలియా, కెనడాల్లో స్థిరపడిన 30 శాతం మంది భారతీయ పౌరసత్వాన్ని త్యజించేందుకు సిద్ధమయ్యారు.

ఇంతకీ ఎందుకు ఇంత భారీస్థాయిలో భారతీయులు పుట్టిన గడ్డపై మమకారాన్ని వదులుకుంటున్నారు? ఇప్పుడిదే ప్రశ్న సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

విదేశాలపై మక్కువతో భారత పౌరసత్వం వదులుకుని పలు దేశాలకు తరలివెళుతున్న వారి సంఖ్య క్రమేణా పెరుగుతోంది. అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్​ వంటి దేశాల్లో స్థిరపడే వారిసంఖ్య రానురాను అధికమౌతోంది. పౌరసత్వం వదులుకుంటోన్న వారిలో వృత్తి నిపుణులే ఎక్కువ.

ఇదే ఐదేళ్ల కాలంలో పదివేలకు పైగా మంది వివిధ దేశాలకు చెందిన 10,645 మంది భారతీయపౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నట్టు నిత్యానంద రాయ్‌ వెల్లడించారు. వారిలో దాదాపు సగం సమందికి భారతీయ పౌరసత్వం దక్కింది. అమెరికా, పాకిస్తాన్‌, ఆఫ్గనిస్తాన్‌, బంగ్లాదేశ్‌ తదితర దేశాల నుంచి భారతీయ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నవారు ఉన్నారు.

విదేశీ మోజా..? డాలర్‌ పై క్రేజా..?

ఇంతకీ పౌరసత్వాన్ని సైతం వదులుకొని, మాతృదేశాన్ని వీడి లక్షల సంఖ్యలో విదేశాలకు ఎందుకు వెళ్ళిపోతున్నారు. భారత రాజ్యాంగం ఏక కాలంలో రెండు దేశాల పౌరసత్వాలు కలిగి ఉండటాన్ని అనుమతించదు. ఇండియన్‌ సిటిజన్‌ షిప్‌ యాక్ట్‌, 1955 ప్రకారం భారతీయులకు రెండు పౌరసత్వాలు ఉండకూడదు. ఒకవేళ ఏ ఇతర దేశానికి సంబంధించిన పౌరసత్వం అన్నా ఉంటే, ఆ వ్యక్తి తప్పనిసరిగా తన భారతీయ పౌరసత్వాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. తక్షణమే తన పాస్‌పోర్ట్‌ సరెండర్‌ చేయాల్సి ఉంటుంది. దీంతో ఆ పాస్‌పోర్టుపై శాశ్వతంగా క్యాన్సిల్డ్‌ ముద్ర పడిపోతుంది.

అత్యధిక భాగం భారతీయులు ఇతర దేశాల పాస్‌పోర్టులు కలిగి ఉండడం వల్ల తమ భారతీయ పౌరసత్వాన్ని వదులుకుంటున్నారు. ప్రపంచ పాస్‌పోర్ట్‌ ఇండెక్స్‌లో భారతదేశానికి 69వ స్థానం. న్యూజీలాండ్‌ రెండవస్థానంలోనూ, ఆస్ట్రేలియా 3వ స్థానంలోనూ, అమెరికా 5వ స్థానంలోనూ, సింగపూర్‌ 6వ స్థానంలోనూ ఉన్నాయి. పాస్‌పోర్ట్‌ ఇండెక్స్‌లో కెనడా 7వ స్థానంలో ఉంది. అయితే యూఏఈ పాస్‌పోర్ట్‌ ఇండెక్స్‌లో అగ్రస్థానాన్ని ఆక్రమించింది.

పాస్‌ పోర్ట్‌ ఇండెక్స్‌ ర్యాంకింగ్‌ ఎంత తక్కువగా ఉంటే, వీసా లేకుండా అనేక దేశాలకు ప్రయాణించడానికి వారికి యాక్సెస్‌ ఉంటుంది. వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలకు వలస ప్రక్రియలో జాప్యాన్ని సైతం ఈ పాస్‌పోర్ట్‌ ఇండెక్స్‌ ర్యాంకింగ్‌ తగ్గిస్తుంది.

మరోవైపు భారత పౌరసత్వం వదులుకుని అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ వంటి దేశాలకు వలస వెళ్లి అక్కడే స్థిరపడిపోతున్న సంపన్నుల సంఖ్య కూడా భారీగానే పెరుగుతోంది. డబ్బు ఇచ్చి మరీ వీరు ఆ దేశాల పౌరసత్వం కొనుక్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది.

2017లో డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా పగ్గాలు చేపట్టాక భారతీయ పౌరసత్వాన్ని వీడేవారిలో కొంత మార్పు కనిపించినప్పటికీ, ట్రంప్‌ తరవాత జో బైడెన్‌ విధానాలు మళ్ళీ భారతీయుల వలసలను ప్రోత్సహిస్తుండడం సిటిజన్‌షిప్‌ వదులుకుంటోన్న వారి సంఖ్య పెరగడానికి కారణమౌతోంది.

అయితే మరో పక్క విదేశాల్లో వ్యాపారం చేయడానికి అక్కడి పౌరసత్వం అక్కర్లేదని, దీర్ఘకాల నివాస వసతి ఉంటే చాలన్నది లక్ష్మీ మిత్తల్‌, మిక్కీ జగ్తియానీ, సన్నీ వర్కీ, ఎంఏ యూసుఫ్‌ అలీ, షంషేర్‌ వయలిల్‌ల వంటి ప్రముఖులు నిరూపిస్తున్నారు.

భారత పౌరసత్వం వదులుకోవడం 2014 నుంచి ఎక్కువైంది. దీనికి ప్రధానంగా భారత్‌లో ఆర్థిక మందగతి, 2014 నుంచి అమలులోకి వచ్చిన పెద్ద నోట్ల రద్దు, నల్ల ధన నివారణకు చేసిన చట్టాలు హెచ్‌ఎన్‌ఐలను విదేశాలకు తరలిపోయేట్లు చేస్తున్నాయి.

నేడు భారత్‌లో అత్యంత సంపన్నులపై గరిష్ఠ ఆదాయ పన్ను రేటు దాదాపు 43 శాతానికి చేరింది. దీంతో పన్ను రేటు బాగా తక్కువగా ఉండే దేశాల పౌరసత్వం కోసం, లేక అక్కడ దీర్ఘకాల నివాసానికీ మన హెచ్‌ఎన్‌ఐలు మొగ్గు చూపుతున్న పరిస్థితి తలెత్తుతోంది.

ఇవి కూడా చదవండి: Jawad Cyclone Live: జెట్‌ స్పీడ్‌తో దూసుకొస్తున్న జొవాద్‌.. సుడులు తిరుగుతూ విశాఖ తీరం వైపు..

Health Tips : కాలీఫ్లవర్ తెగ ఇష్టంగా తింటున్నారా.. అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే..

భూమ్మీద జీవించిన అతిపెద్ద పాము.. సాక్షాత్తు పరమేశ్వరుడితో లింక్..
భూమ్మీద జీవించిన అతిపెద్ద పాము.. సాక్షాత్తు పరమేశ్వరుడితో లింక్..
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ హిట్ మూవీ..
ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ హిట్ మూవీ..
మహానదిలో పెను ప్రమాదం... 50 మందితో వెళ్తున్న పడవ బోల్తా..
మహానదిలో పెను ప్రమాదం... 50 మందితో వెళ్తున్న పడవ బోల్తా..
ధోనితో పోజిస్తున్న ఈ చిచ్చరపిడుగు ఎవరో గుర్తుపట్టారా.?
ధోనితో పోజిస్తున్న ఈ చిచ్చరపిడుగు ఎవరో గుర్తుపట్టారా.?
9 బంతుల్లో కోహ్లీ టీమ్‌మేట్‌కి ప్యాకప్ చేప్పేశాడు.. మొనగాడు సామీ
9 బంతుల్లో కోహ్లీ టీమ్‌మేట్‌కి ప్యాకప్ చేప్పేశాడు.. మొనగాడు సామీ
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఉత్కంఠగా టుడే ఎపిసోడ్.. బిడ్డను ఎత్తుకెళ్లిన సుభాష్.. కారణం అదేనా
ఉత్కంఠగా టుడే ఎపిసోడ్.. బిడ్డను ఎత్తుకెళ్లిన సుభాష్.. కారణం అదేనా
షుగర్‌ ఉన్న వాళ్లకు కళ్లు ఎందుకు సరిగ్గా కనిపించవు.?
షుగర్‌ ఉన్న వాళ్లకు కళ్లు ఎందుకు సరిగ్గా కనిపించవు.?
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.