AP – TS Water War: తెలంగాణ మంత్రుల కామెంట్స్‌కు.. తొలిసారి ఘాటుగా బ‌దులిచ్చిన ఏపీ మంత్రి బొత్స‌

|

Jun 30, 2021 | 1:22 PM

ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జల వివాదం రోజురోజుకు మరింత ముదురుతోంది. ఆర్డీఎస్​ ప్రాజెక్టు విస్తరణతో మొదలైన ఈ వివాదం.. ఇప్పుడు నాగార్జున సాగర్ వరకు పాకింది.

AP - TS Water War: తెలంగాణ మంత్రుల కామెంట్స్‌కు.. తొలిసారి ఘాటుగా బ‌దులిచ్చిన ఏపీ మంత్రి బొత్స‌
minister-botsa-satyanarayana
Follow us on

ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జల వివాదం రోజురోజుకు మరింత ముదురుతోంది. ఆర్డీఎస్​ ప్రాజెక్టు విస్తరణతో మొదలైన ఈ వివాదం.. ఇప్పుడు నాగార్జున సాగర్ వరకు పాకింది. తెలంగాణ మంత్రులు ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ సీఎం, దివంగ‌త నేత వైఎస్సార్‌పై మాట‌ల తూటాలు పేల్చుతున్నారు. ఏపీ ప్ర‌భుత్వం, సీఎం జ‌గ‌న్‌పై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. కాగా ఇప్ప‌టివ‌ర‌కు సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకుందామ‌ని ఏపీ ప్ర‌భుత్వ వ‌ర్గాలు బ‌దులిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే తాజాగా ఏపీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ కాస్త ఘాటుగానే తెలంగాణ మంత్రుల వ్యాఖ్య‌ల‌కు కౌంట‌రిచ్చారు. రాజకీయ లబ్ది కోసం తెలంగాణ నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే అక్క‌డి ప్రజలే బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. తెలంగాణ మంత్రులలా అసభ్య పదజాలం ఉపయోగించాల్సిన అవసరం లేదన్న బొత్స‌.. నీటి పంపకాల వివాదం అంశంపై త‌మ ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉందన్నారు.

త‌మ‌ ప్రభుత్వం చేతులు ముడుచుకుని కూర్చోలేదని.. ఫెడరల్ వ్యవస్థలో ఎవరి అధికారాలు వారికి ఉంటాయని చెప్పారు విభజన చట్టానికి లోబడే నీటి పంపకాలు ఉంటాయ‌ని.. చట్ట పరిధులు దాటితే వ్యవస్థలు జోక్యం చేసుకుంటాయని వెల్ల‌డించారు. తామేమి మౌనంగా లేమ‌ని, త‌మ‌ వ్యూహాలు త‌మ‌కు ఉన్నాయ‌న్నారు. సమస్యను మరింత జఠిలం చేయడానికి, తెలంగాణ మంత్రులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు సహకరిస్తామని తెలిపారు. బుధ‌వారం కృష్ణా కరకట్ట విస్తరణ పనులు మొదలు పెట్టిన నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన బొత్స ఈ కామెంట్స్ చేశారు. త్వరలోనే సీడ్ యాక్సెస్ రోడ్డు పనులు కూడా ప్రారంభిస్తామ‌ని పేర్కొన్నారు.

Also Read: తెలుగు రాష్ట్రాల మధ్య ముదిరిన ‘జల జగడం’.. కేఆర్‌ఎంబీకి ఏపీ ప్రభుత్వం మరో లేఖ!

గ్యాస్ సిలిండర్ పేలి.. ఒకే కుటుంబంలోని నలుగురు దుర్మరణం..