AP Elections 2024 Counting: లోక్ సభ ఫలితాల్లో టీడీపీ ముందంజ.. ఈ నియోజకవర్గాల్లో మెజార్టీ వీరిదే..

|

Jun 04, 2024 | 9:42 AM

ఏపీలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రతి రౌండులో ఆసక్తికరమైన ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటివరకు లోక్ సభ ఫలితాల్లో దాదాపు టీడీపీ అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు. శ్రీకాకుళంలో టీడీపీ లీడ్ లో ఉండగా, రాజమండ్రిలో పురంధేశ్వరి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. నర్సాపుర్ పార్లమెంట్ స్థానంలో కూడా బీజేపీ లీడ్ లో ఉంది. గుంటూరు జిల్లా పార్లమెంట్ నియోజకవర్గంలో టీడీపీ ముందంజలో కొనసాగుతోంది.

AP Elections 2024 Counting: లోక్ సభ ఫలితాల్లో టీడీపీ ముందంజ.. ఈ నియోజకవర్గాల్లో మెజార్టీ వీరిదే..
Ycp and Tdp
Follow us on

ఏపీలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రతి రౌండులో ఆసక్తికరమైన ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటివరకు లోక్ సభ ఫలితాల్లో దాదాపు టీడీపీ అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు. శ్రీకాకుళంలో టీడీపీ లీడ్ లో ఉండగా, రాజమండ్రిలో పురంధేశ్వరి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. నర్సాపుర్ పార్లమెంట్ స్థానంలో కూడా బీజేపీ లీడ్ లో ఉంది. గుంటూరు జిల్లా పార్లమెంట్ నియోజకవర్గంలో టీడీపీ ముందంజలో కొనసాగుతోంది. కడపలో వైసీపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి వెనుకంజలో ఉన్నారు. విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి చిన్ని ఆధిక్యంలో ఉండగా.. నరసరావుపేట టీడీపీ అభ్యర్థి కృష్ణదేవరాయలు లీడ్లో కొనసాగుతున్నారు. నంద్యాలలో టీడీపీ అభ్యర్థి బైరెడ్డి శబరి ఆధిక్యంలో కాగా తిరుపతి బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ ఆధిక్యంలో ఉన్నారు. అనంతపురం జిల్లాలో హిందూపురంలో టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి పార్థసారథి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అనంతపురంలో కూడా టీడీపీ ఎంపీ అభ్యర్థి లక్ష్మీనారాయణ లీడ్లో ఉన్నారు. తొలి రౌండ్ ఈవీఎం ఓట్ల లెక్కింపులో టీడీపీకి క్లియర్ మెజార్టీ కనిపిస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మరిన్ని ఏపీ లైవ్ అప్డేట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..