Andhra Pradesh: రాజధాని అంశంపై గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు.. ‘కొత్త విద్యా సంవత్సరం నుంచే విశాఖ’ అంటూ..

|

Mar 07, 2023 | 6:35 AM

ముఖ్యమంత్రి జగన్‌ మరి కొద్ది రోజుల్లో విశాఖ వస్తారని.. ఇక్కడి నుంచే పాలన ప్రారంభమవుతుందని గుడివాడ అమర్నాథ్‌ అన్నారు. అంతేకాక వచ్చే విద్యా సంవత్సరం(2023-24) నుంచి రాజధాని..

Andhra Pradesh: రాజధాని అంశంపై గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు.. ‘కొత్త విద్యా సంవత్సరం నుంచే విశాఖ’ అంటూ..
Gudivada Amarnath On State Capital
Follow us on

ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌ మరి కొద్ది రోజుల్లో విశాఖ వస్తారని.. ఇక్కడి నుంచే పాలన ప్రారంభమవుతుందని ఆయన అన్నారు. అంతేకాక వచ్చే విద్యా సంవత్సరం(2023-24) నుంచి రాజధాని కార్యకలాపాలు కూడా మొదలవుతాయని అన్నారు. అందరూ అనుకున్న సమయం కంటే ముందే ముఖ్యమంత్రి విశాఖ వస్తారని ఇక్కడి నుంచే పాలన సాగిస్తారని చెప్పారు. గత కొన్ని నెలలుగా రాజధాని విషయంలో అధికార వైకాపా నేతలు వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే విశాఖ నుంచే రాష్ట్ర పాలన జరుగుతుందని, అందు కోసం తగిన ఏర్పాట్లు కూడా చురుగ్గా సాగుతున్నాయని వివిధ సందర్భాల్లో పలువురు నేతలు తెలిపారు. తాజాగా విశాఖలో నిర్వహించిన వరల్డ్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో సీఎం జగన్‌ కూడా ఇదే అంశాన్ని స్వయంగా ప్రస్తావించారు. రాష్ట్రం నుంచి ఎగుమతులు గణనీయంగా పెరిగాయన్న ఆయన.. రాష్ట్రంలో మూడు పారిశ్రామిక కారిడార్లు ఉన్నాయని, భౌగోళికంగా పరిశ్రమలకు ఏపీ అనుకూలంగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా విశాఖ త్వరలో పరిపాలన రాజధాని కాబోతోందని, తాను కూడా విశాఖ నుంచే పాలన చేయబోతున్నానని ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..