Andhra Pradesh: ‘మాకూ చేతులు, చెప్పులు ఉన్నాయి’.. పవన్ కళ్యాణ్‌‌‌కు వార్నింగ్ ఇచ్చిన ఏపీ ఐటీ మంత్రి.. ఇంకా ఏమన్నారంటే..

|

Jan 13, 2023 | 11:45 AM

గురువారం జరిగిన ‘యువశక్తి సభ’లో పవన్‌ కల్యాణ్‌ చేసిన ప్రసంగంపై స్పందించిన మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా..

Andhra Pradesh: ‘మాకూ చేతులు, చెప్పులు ఉన్నాయి’.. పవన్ కళ్యాణ్‌‌‌కు వార్నింగ్ ఇచ్చిన ఏపీ ఐటీ మంత్రి.. ఇంకా ఏమన్నారంటే..
Gudivada Amarnath Comments On Pawan Kalyan
Follow us on

గురువారం జరిగిన ‘యువశక్తి సభ’లో పవన్‌ కల్యాణ్‌ చేసిన ప్రసంగంపై స్పందించిన మంత్రి గుడివాడ అమర్నాథ్ విరుచుకుపడ్డారు. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి అమర్నాథ్ పలు వ్యాఖ్యలు చేశారు. జనసేన ఆధ్వర్యంలో శ్రీకాకుళం రణస్థలంలో నిన్న(జనవరి 12) ఏర్పాటు చేసిన యువశక్తి సభలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పలు వ్యాఖ్యలు చేశారు. వాటిపై స్పందించిన అమర్నాథ్.. కొట్టడానికి తమకూ చేతులు, చెప్పులు ఉన్నాయన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం పాలచర్లలో గత రాత్రి నిర్వహించిన క్రీడా పోటీల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రణస్థలంలో పవన్ నోటికొచ్చినట్టు మాట్లాడారన్నారు. చేతికి అందే దూరంలో ఉంటే సీఎంను కొడతానని అన్నారని, చెప్పుతో కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు అమర్నాథ్.

తమకూ చేతులు, చెప్పులు ఉన్నాయన్న సంగతిని గుర్తుపెట్టుకోవాలని అమర్నాథ్ సూచించారు. తమకంటే పోరాడేవారు ఎవరూ లేరన్న పవన్ చివరికి ఒంటరిగా పోటీచేస్తే వీరమరణం తప్పదని, తానొక ప్యాకేజీ స్టార్‌నని చెప్పకనే చెప్పారని మంత్రి అమర్నాథ్ ఎద్దేవా చేశారు. ‘రణస్థలం సమావేశంలో ముఖ్యమంత్రిగా రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిపై పవన్‌ కళ్యాణ్ నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం దారుణం. చేతికి అందే దూరంలో ఉంటే సీఎం‌నే కొడతాను అంటూ ప్రగల్బాలు పలికడమే కాక, చెప్పుతో కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కొట్టడానికి మాకు కూడా చేతులు ఉన్నాయి.. మేము చెప్పులు వేసుకుంటాం’ అంటూ జనసేనాని పవన్‌కు వార్నింగ్ ఇచ్చారు మంత్రి.

ఇవి కూడా చదవండి

‘సమస్యలపై ప్రశ్నిస్తాను’ అంటూ పవన్ కళ్యాణ్ సమావేశం ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు రాసి ఇచ్చిన స్క్రిప్ట్‌‌ను చదివాడంటూ మంత్రి అమర్నాథ్ ఎద్దేవా చేశారు. సంక్షేమ పథకాల గురించి సీఎం జగన్‌ను తిట్టడం ఆయన విజ్ఞతకే విదిలేస్తున్నామని.. జనాలే చూసి బుద్ది చెప్తారని మంత్రి పేర్కొన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..