AP Inter Evaluation: రేపట్నుంచి ఇంటర్‌ జవాబు పత్రాల మూల్యాంకనం.. జూనియర్ కాలేజీలకు ఆదేశాలు

|

Mar 31, 2023 | 1:23 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితయ సంవత్సరం వార్షిక పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ పరీక్షల జవాబు పత్రాల మూల్యంకనం ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి మాచవరంలోని ఎస్సారార్‌ అండ్‌ సీవీఆర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల..

AP Inter Evaluation: రేపట్నుంచి ఇంటర్‌ జవాబు పత్రాల మూల్యాంకనం.. జూనియర్ కాలేజీలకు ఆదేశాలు
AP Inter Evaluation
Follow us on

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితయ సంవత్సరం వార్షిక పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ పరీక్షల జవాబు పత్రాల మూల్యంకనం ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి మాచవరంలోని ఎస్సారార్‌ అండ్‌ సీవీఆర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రాంగణంలో జరగనున్నట్లు ఉమ్మడి కృష్ణా జిల్లా ఆర్‌ఐవో పి రవికుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

ఇంగ్లిష్‌, హిందీ, తెలుగు, గణితం, సివిక్స్‌ జవాబు పత్రాల మూల్యాంకనం రేపట్నుంచి ప్రారంభమవుతుందన్నారు. ఇంటర్‌ విద్యా మండలి నుంచి ఉత్తర్వులు అందుకున్న ఆయా అధ్యాపకులు మూల్యాంకనానికి విధిగా హాజరవ్వాలని పేర్కొన్నారు. ప్రభుత్వ కాలేజీల ప్రిన్సిపల్‌లు, ప్రైవేటు యాజమాన్యాలు తమ అధ్యాపకులు విధులకు హాజరయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. అధ్యాపకులను పంపని కళాశాలల గుర్తింపును రద్దు చేస్తామని ఆయన హెచ్చరించారు. కాగా ఏపీ ఇంటర్‌ ప్రథమ సంవత్సరం వార్షిక పరీక్షలు ఏప్రిల్‌ 3వ తేదీతో ముగియనున్నాయి. ద్వితియ సంవత్సరం పరీక్షలు ఏప్రిల్‌ 4తో ముగియనున్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.